- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 500 నూతన వాహనాలు..
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన బాలింతలకు ఉచిత, సురక్షిత రవాణా..
రాష్ట్రంలో మాతా–శిశు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం, ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ సేవలను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా, గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షితమైన, నాణ్యమైన రవాణా సౌకర్యం కల్పించేందుకు సిద్ధం చేసిన 500 నూతన వాహనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం తన క్యాంపు కార్యాలయంలో పరిశీలించారు.
ఈ సందర్భంగా వాహనాల రూపకల్పన, భద్రతా ప్రమాణాలు, ప్రయాణికులకు కల్పించిన సౌకర్యాలను సీఎం క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ముఖ్యంగా తల్లీబిడ్డల అవసరాలకు అనుగుణంగా వాహనాల్లో చేసిన మార్పులను అధికారులు ఆయనకు వివరించారు. ఈ సేవలపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించేలా వాహనాలపై రూపొందించిన బ్రాండింగ్ నమూనాలను పరిశీలించి, వాటికి ఆమోదం తెలిపారు.
