Homeసినిమా"1=100" | ఘనంగా "1=100" మూవీ టీజర్ లాంచ్

“1=100” | ఘనంగా “1=100” మూవీ టీజర్ లాంచ్

శకుంతల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బాబా మైలవరం దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం “1=100” టీజర్ లాంచ్ వేడుక హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది. ప్రముఖ నిర్మాత రిజ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై టీజర్‌ను ఆవిష్కరించి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
వెస్ట్రన్ స్టైల్ విజువల్స్, యాక్షన్ ఎలిమెంట్స్, అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో కూడిన ఈ టీజర్ ప్రేక్షకులను, సినీ ప్రముఖులను విశేషంగా ఆకట్టుకుంది. అనిల్ కుమార్ వేగూరు సినిమాటోగ్రఫీ, కెన్నీ చైతన్య సంగీతం, నందమూరి హరి ఎడిటింగ్ ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి. రాజు ఎంటర్‌టైనర్స్, స్పార్కిల్ డాన్స్ స్టూడియో ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఇప్పటికే టీజర్‌కు వస్తున్న భారీ రెస్పాన్స్ తమకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోందని, త్వరలోనే సినిమా మరిన్ని వివరాలను వెల్లడిస్తామని చిత్ర బృందం పేర్కొంది.

1100 Movie Grand Teaser Launch Event1
1100 Movie Grand Teaser Launch Event3

ఈ చిత్రానికి

  • దర్శకత్వం : బాబా మైలవరం
  • డీఓపీ: అనీల్ కుమార్ వేగూరు
  • సంగీతం: కెన్నీ చైతన్య
  • ఎడిటర్: నందమూరి హరి
  • కొరియోగ్రఫీ: సూర్యాస్ మాస్టర్, జోజో
  • ఫైట్స్: కృష్ణ ఎస్.ఎం. రాజు, డైమండ్ వెంకట్
  • ఆర్ట్ డైరెక్టర్: నానాజీ
  • పోస్ట్ ప్రొడక్షన్: డిజిక్వెస్ట్
  • PRO: శ్రీపాల్
- Advertisement -
RELATED ARTICLES

Latest News