పెళ్లి పళ్లకిలో పెళ్లి కూతురు..
పాడేపై స్త్రీ శవ అంతిమ యాత్ర..
రెండిటిని నలుగురే మోస్తారు
ఇద్దరి నుదుట తిలకమే..
ఇద్దరి చుట్టూ జనమే..
ఒకటి నూతన జీవన యాత్ర
మరోటి అంతిమ శవ యాత్ర
మహిళ శవానికి పచ్చని గాజులు
పెళ్లి కూతురుకు పచ్చని గాజులు
ఒక దానిపై నూతన శ్వేత వర్ణ వస్త్రం
మరోకరి ఒంటికి నూతన వస్త్రాలు
ఒకరి ప్రియుడు సంతోషిస్తాడు
మరొకరి ప్రియుడు ఏడుస్తాడు
పుట్టింటికి వీడ్కోలు పలకడం
ఇంట్లోంచి శాశ్వతంగా వెళ్ళిపోవడం
పెళ్లి కూతురుకు కట్నం రాస్తారు
స్త్రీ శవంపై పైసలు చల్లుతారు
ఒకరి ప్రయాణం మెట్టింటి వరకు
మరొకరి ప్రయాణం పైలోకం వరకు
ఒకరికి నూతన జీవితం ప్రారంభం
మరొకరి జీవితం అంత సంకేతం
పళ్లకి చుట్టూ జన ఆనంద భాష్పాలు
శవ పేటిక చుట్టు కన్నీటి వరదలు
అత్తారింటికి స్వాగత తోరణాలు
స్వంత ఇంటికి శాశ్వత వీడ్కోలు
పళ్లకి ఎక్కిన వారంతా కొన్నాళ్లకు..
పాడె నెక్కి ప్రయాణం చేయాల్సిందే !
Life | పళ్లకి – పాడే
- Advertisement -
