- శ్రీలంకలో నెలకొన్న ఆలయం..
సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలన్నీ శక్తి పీఠాలుగా విరాజిల్లుతున్నాయి. వాస్తవానికి ఈ శక్తిపీఠాలు 51 అయినప్పటికీ అందులో ప్రధానమైనవి మాత్రం 18. వీటినే అష్టాదశ శక్తి పీఠాలుగా వ్యవహరిస్తారు. ఇందులో ఒక శక్తిపీఠం మన పొరుగు దేశమైన శ్రీలంకలో ఉంది. ఈ కథనంలో శాంకరి దేవి శక్తి పీఠం గురించి తెలుసుకుందాం.
దక్ష ప్రజాపతి నిర్వహించిన నిరీశ్వర యాగంలో జరిగిన శివనిందను భరించలేక సతీదేవి ఆత్మాహుతి చేసుకుంటుంది. అందుకు ఆగ్రహించిన పరమేశ్వరుడు తన జటాజూటం నుంచి వీరభద్రుని సృష్టిస్తాడు. వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి, నిరీశ్వర యాగానికి వచ్చిన వారందరినీ తరిమి తరిమి కొడతాడు. సతీదేవి వియోగాన్ని భరించలేని శివుడు ఆమె శరీరాన్ని చేత ధరించి ఉగ్ర తాండవం చేయసాగాడు. ఆ సమయంలో శివునికి ఉపశమనం కలిగించడం కోసం శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ఖండిస్తాడు. ఆ సమయంలో సతీదేవి శరీర భాగాలూ అనేక ప్రదేశాల్లో చెల్లాచెదురుగా పడతాయి.
సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలు నేడు పవిత్ర శక్తి పీఠాలుగా, పుణ్య క్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి. ప్రధానమైన 18 శక్తి పీఠాలలో ఒక శక్తిపీఠం మన పొరుగు దేశమైన శ్రీలంకలో ఉంది. శాంకరీ దేవి శక్తి పీఠం చరిత్ర గురించి, విశిష్టత గురించి తెలుసుకుందాం. ఆదిశంకరులు తన అష్టాదశ శక్తి పీఠ స్తోత్రంలో పేర్కొన్న 18 మహా శక్తి పీఠాల్లో, భారత దేశానికి వెలుపల ఉన్న అత్యంత ముఖ్యమైన క్షేత్రం శ్రీలంకలోని త్రికోణమలై లేదా ట్రింకోమలిలో కొలువై ఉన్న శ్రీ శాంకరి దేవి శక్తి పీఠం. శాంకరీ శక్తి పీఠంలో సతీదేవి తొడ భాగం పడిందని ప్రసిద్ధి. కొంతమంది అమ్మవారి వడ్డాణం పడిన ప్రదేశమని కూడా అంటారు.
రాక్షసరాజు రావణాసురుని చరిత్రతో ముడిపడి ఉన్న ఈ విశిష్ట పీఠం చరిత్రను తెలుసుకుందాం. త్రికోణమలైలో, మూడు వైపులా నీలి సముద్రంతో చుట్టబడిన ఒక పెద్ద రాతి కొండ. స్వామిమలైగా పిలిచే ఈ శిఖరంపై ప్రసిద్ధ ‘తిరుకోణేశ్వరం’ శివాలయం ఉంది. ఈ శివాలయ ప్రాంగణంలోనే శ్రీ శాంకరీ దేవి అమ్మవారి శక్తి పీఠం కొలువై ఉంది. శివశక్తులు ఇద్దరూ కలిసి అనుగ్రహించే అద్భుతమైన క్షేత్రం ఇది. రామాయణ కాలంలో, పరమ శివభక్తుడైన రావణాసురుడు తన తల్లి పూజల కొరకు ఈ తిరుకోణేశ్వర ఆలయాన్ని నిర్మించినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. రావణుడిచే పూజలందుకున్న ఘనత అమ్మవారు శాంకరీ దేవికి, కోణేశ్వర స్వామికి ఉంది
