Saturday, July 4, 2026
Homeకెరీర్ న్యూస్Textbooks | పాఠ్యపుస్తకాలు ఇంకా అందలేదు..

Textbooks | పాఠ్యపుస్తకాలు ఇంకా అందలేదు..

  • ఇంటర్ క్లాసులు ప్రారంభమైయ్యాయి..
  • తెలుగు మీడియం పుస్తకాలు పూర్తి స్థాయిలో అందలేదు..

కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమై నెలరోజులవుతున్నది. ఇంటర్‌ క్లాసులు కూడా ప్రారంభమయ్యా యి. కానీ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ ల్లో వేలాది మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇంకా అందలేదు. ప్రత్యేకించి వొకేషనల్‌ కోర్సులు, ఉర్దూ మీడియం విద్యార్థులకు ఇంకా చేరలేదు.

తెలుగు మీడియం పాఠ్యపుస్తకాలు పూర్తిస్థాయిలో అందలేదని లెక్చరర్లు చెప్తున్నారు. ఇంగ్లిష్‌ మీడియం పుస్తకాలను అందుబాటులోకి తెచ్చిన అధికారులు, మిగతా పుస్తకాలపై శ్రద్ధ చూపడంలేదన్న వాదనలున్నాయి. ఇటీవలే లెక్చరర్ల సంఘం నేతలు వీ శ్రీనివాస్‌, కే సురేశ్‌ పాఠ్యపుస్తకాలు అందలేదన్న విషయాన్ని ఇంటర్‌బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్‌ దృష్టికి తీసుకెళ్లారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News