Saturday, July 4, 2026
Homeమెదక్‌Edupayala | ఏడుపాయల హుండీ ఆదాయం రూ. 65.89 లక్షలు

Edupayala | ఏడుపాయల హుండీ ఆదాయం రూ. 65.89 లక్షలు

ఏడుపాయల శ్రీ వనదుర్గ భవాని దేవస్థానంలో శుక్రవారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ మఠం వీరేశం, దేవాదాయ శాఖ మెదక్ జిల్లా ఇన్‌స్పెక్టర్ రంగారావు ఆధ్వర్యంలో మెదక్ ఇండియన్ బ్యాంక్ సిబ్బంది, శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ సభ్యుల సహకారంతో హుండీ లెక్కింపు చేపట్టారు.

గత 77 రోజుల కాలానికి సంబంధించిన హుండీ ఆదాయం రూ.65,89,200 వచ్చినట్లు అధికారులు తెలిపారు. నగదుతో పాటు 0.038 గ్రాముల మిశ్రమ బంగారం, 1.230 కిలోల మిశ్రమ వెండి కూడా లభించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, పాపన్నపేట పోలీసు సిబ్బంది, శ్రీ వెంకట అన్నమాచార్య సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News