Thursday, July 2, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంYadagirigutta | కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణాలో.. ఆంధ్రుల పెత్తనం ఏంటీ..?

Yadagirigutta | కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణాలో.. ఆంధ్రుల పెత్తనం ఏంటీ..?

  • యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డులో ఆంధ్రులకు చోటు ఎలా ఇస్తారు..?
  • తెలంగాణ విషయంలో యూటర్న్ తీసుకున్న చిరంజీవి
  • తెలంగాణను ఆంధ్రవాళ్లకు తాకట్టు పెడుతున్నారా..?
  • యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు నుండి ఆంధ్రావాళ్లను తొలగించాలి
  • ఆంధ్రోý్లకు పదవులు ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటి..?

ఆంధ్ర ప్రదేశ్ తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మోడల్ తరహాలో తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ట్రస్టు బోర్డును ఏర్పాటు చేయడం పట్ల రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన నీళ్లు మన నిధులు మన నియామకాలు మనకి కావాలనికొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆంధ్ర పెత్తనం ఉండొద్దన్న సంకల్పంతోనే నాడు తెలంగాణ తొలి మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వంలో తెలంగాణలో పని చేస్తున్నటువంటి ఆంధ్రులను వెంటనే తమ రాష్ట్రాలకు పంపించాలన్న విషయం అందరికీ తెలిసిందే.

కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తిరుమల తిరుపతి యాదగిరిగుట్ట దేవస్థానంలో ఆంధ్రులకు ట్రస్టు బోర్డులో స్థానం కల్పించడం పైన సత్వర విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. రాష్ట్ర ముఖ్య మంత్రి అయ్యుండి ఆంధ్రకు తొత్తుగా పనిచేస్తున్నాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రా వాళ్లకు తాకట్టు పెట్టాలని ధోరణితోనే ఇలా ప్రవర్తిస్తున్నాడంటూ ప్రతిపక్ష నేతలు తీవ్రస్థాయి లో మండిపడుతున్నారు. నాడు తెలంగాణ విషయంలో అప్పటి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి తెలంగాణ విషయంలో యూటర్న్ తీసుకున్నాడు.

- Advertisement -

ఆంధ్రా నుంచి తెలంగాణను వీడితీసే ప్రసక్తే లేదన్న చిరంజీవి భార్యతో పాటు మిగతా ఇద్దరు ఆంధ్రులకు ట్రస్ట్ బోర్డ్‌లో అవకాశం కల్పించడం వెనుక ముఖ్యమంత్రి ఆంతర్యం ఏమిటని రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి జిల్లా ఉద్యమాల గడ్డ కు ట్రస్ట్ బోర్డులో అవకాశం కల్పించలేక పోవడంపై ప్రజలు ఆగ్రహ వేషాలకు గురవుతున్నారని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆంధ్రులకు స్థానం కల్పించినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ వాళ్లకు కూడా స్థానం కల్పించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకోగలరా..? లేదా..? అన్న సందేహం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట ట్రస్టు బోర్డు నుండి ఆంధ్రావాళ్లను తొలగించి తెలంగాణ వాళ్లకు స్ధానం కల్పించాలని లేనియెడల ప్రజా ప్రభుత్వపై దండయాత్రకు సిద్ధమంటూ అసలు సీసలైన తెలంగాణ వాదులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News