Wednesday, July 1, 2026
HomeసినిమాRamba Oorvasi Menaka | మూవీ ఆకట్టుకునే ఫస్ట్ లుక్

Ramba Oorvasi Menaka | మూవీ ఆకట్టుకునే ఫస్ట్ లుక్

విభిన్నమైన కథలు, మంచి కంటెంట్ చిత్రాలతో ఎప్పటికప్పుడు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ వస్తున్న కామెడీ కింగ్ అల్లరి నరేష్, తనను స్టార్ హీరోగా నిలబెట్టిన కామెడీ జానర్‌లో మరోసారి సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఆయన నటిస్తున్న 65వ చిత్రం #Naresh65కు చంద్ర మోహన్ చింతాడ దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫాంటసీకి వినోదాన్ని జోడిస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి “కామెడీ గోస్ కాస్మిక్” అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌ను ఇచ్చారు. ఈ చిత్రం మ్యాజికల్ ట్విస్టులు, వినోదభరితమైన సంఘటనలతో సరికొత్త థియేట్రికల్ అనుభూతిని అందించబోతుంది.

అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ‘రంభ ఊర్వశి మేనక’ అనే ఆసక్తికరమైన టైటిల్, ఆకట్టుకునే ఫస్ట్ లుక్‌తో ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది ఇంతకు ముందెన్నడూ చూడని రీతిలో అద్భుతమైన వినోదాన్ని పంచే ఫాంటసీ కామెడీ చిత్రంగా వుండబోతుంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అల్లరి నరేష్ స్టైలిష్‌గా కనిపిస్తున్నారు.

- Advertisement -

ఆయన స్వర్గలోకపు మెట్లపై కూర్చుని, చేతిలో కలం, ‘రంభ, ఊర్వశి, మేనక’ పేర్లు రాసి ఉన్న పేపర్ పట్టుకుని ఉండగా, పైన మేఘాల మధ్య అప్సరసలు కనిపిస్తున్నారు. డివైన్ ఎలిమెంట్స్, హాస్యంతో కూడిన ఈ క్రియేటివ్ డిజైన్, ఫాంటసీ, వినోదం, అల్లరి నరేష్ మార్క్ కామెడీ కలగలిసిన ఒక ప్రత్యేకమైన ‘కాస్మిక్ ఎంటర్‌టైనర్’ అందించబోతోంది.

ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, నరేష్ వి.కె., శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ఇతర ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరంతా తమ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధమవుతున్నారు.

అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు, రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహించగా, చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తుండగా, చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్. అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ ఫాంటసీ ప్రపంచాన్ని అద్భుతంగా తెరపైకి తీసుకురావడానికి చిత్ర బృందం కృషి చేస్తోంది.

వినూత్నమైన టైటిల్, ఆకట్టుకునే ఫస్ట్ లుక్ పోస్టర్, ఆసక్తికరమైన ఫాంటసీ-కామెడీ కథాంశంతో ‘రంభ ఊర్వశి మేనక’ ఇప్పటికే మంచి బజ్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

తారాగణం: అల్లరి నరేష్, వెన్నెల కిషోర్, నరేష్ వీకే, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్

సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: చంద్రమోహన్ చింతాడ
నిర్మాతలు: రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్
బ్యానర్లు: అన్నపూర్ణ స్టూడియోస్ & హాస్య మూవీస్
సంగీతం: చైతన్ భరద్వాజ్
డిఓపి: రాంరెడ్డి
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

- Advertisement -
RELATED ARTICLES

Latest News