Homeసినిమా‘HIGH’ | సినిమా నుంచి ప్రమోషనల్ సాంగ్ ‘దమ్ములుంటే’ రిలీజ్

‘HIGH’ | సినిమా నుంచి ప్రమోషనల్ సాంగ్ ‘దమ్ములుంటే’ రిలీజ్

బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి పనిచేయడంతో పాటు, పలు విజయవంతమైన సినిమాలకు కో-రైటర్‌గా వ్యవహరించి గుర్తింపు తెచ్చుకున్న ఎస్ కృష్ణ ఇప్పుడు దర్శకుడిగా అలరించబోతున్నారు. ‘హై’(HIGH) సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్న ఆయన.. ఈ చిత్రానికి రచయితగా, నటుడిగా కూడా తన ప్రతిభను చాటుతున్నారు. సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. హరీష్ పెద్ది, శేఖర్ దివ్వెలతో కలిసి ఈ చిత్రాన్ని సహ నిర్మాతగా నిర్మిస్తున్నారు. ఇమేజ్‌స్పార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, మైరా క్రియేషన్స్ బ్యానర్లపై రూపొందుతున్న ‘హై’(HIGH) భావోద్వేగాలు, ఆసక్తికరమైన డ్రామా, ఎనర్జీతో కూడిన సన్నివేశాలతో ప్రేక్షకులకు ఆకట్టుకునే సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించనుంది. అనన్య శర్మ, ఎస్ కృష్ణ, పల్లవి దొర, కృష్ణ కమల్, సాయి కృష్ణ, రేవంత్ (బుల్లిరాజు) ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

‘హై’ సినిమా ప్రమోషనల్ సాంగ్ ‘దమ్ములుంటే’ విడుదలైంది. సాధారణ ప్రమోషనల్ విజువల్స్‌కు భిన్నంగా, మేకర్స్ ఈ పాటను సరదాగా, ఉత్సాహంగా రూపొందించారు. సినిమాలోని ప్రధాన తారాగణమంతా క్రికెట్ నేపథ్యంతో తెరకెక్కించిన వీడియోలో కనిపిస్తూ సందడి చేశారు. యూత్‌ఫుల్ సెలబ్రేషన్స్‌తో నిండిన ఈ వీడియో పాటలోని మూడ్‌ను ప్రతిబింబిస్తూ ప్రేక్షకులకు మంచి విజువల్ ట్రీట్ అందిస్తోంది.

- Advertisement -

రోల్ రైడా ఎనర్జిటిక్ ర్యాప్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలవగా, వికాస్ బదిసా తన బీట్‌తో కూడిన సంగీతం, ఉత్సాహభరితమైన రిథమ్స్‌తో పాటకు మరింత జోష్ తీసుకొచ్చారు. సాహిత్యం కూడా పాటకు అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. మొత్తంగా ‘దమ్ములుంటే’ సంగీత ప్రియులను అలరించేలా రూపొందింది.

స్నేహం, సరదా, అనుకోకుండా ఎదురయ్యే ఆసక్తికరమైన క్షణాలు.. యూత్ జీవితంలో ఉండే ఉత్సాహాన్ని ఈ పాట ప్రతిబింబిస్తుంది. రంగురంగుల విజువల్స్, ఉత్సాహభరితమైన కొరియోగ్రఫీ పాటకు మరింత ఆకర్షణను జోడించాయి.

మనుషులు ఆనందం, సంతోషం, ఉత్సాహం కోసం ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. అలాంటి విభిన్నమైన కోరికలతో ముందుకు సాగే పాత్రల కథే ‘హై’. ప్రతి పాత్ర వెనుక ఒక ప్రత్యేకమైన ఆకాంక్ష ఉంటుంది. ఈ పాత్రల ప్రయాణాలను ఒకదానితో ఒకటి ముడిపెడుతూ, మనుషుల నిర్ణయాల్లోని భావోద్వేగ, మానసిక, నైతిక కోణాలను ఈ సినిమా ఆవిష్కరించనుంది.

ఈ చిత్రానికి మల్లు నాయక్, సునీల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వికాస బదిసా సంగీతం సమకూరుస్తున్నారు. జీఆర్‌కే శరణ్ రావుల ఎడిటర్‌గా వ్యవహరిస్తుండగా, వి. వెంకట్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

నటీనటులు:అనన్య శర్మ, ఎస్ కృష్ణ, పల్లవి దొర, కృష్ణ కమల్, సాయి కృష్ణ, రేవంత్ (బుల్లిరాజు)

సాంకేతిక బృందం:
రచయిత – దర్శకుడు: ఎస్ కృష్ణ
నిర్మాతలు: హరీష్ పెద్ది, ఎస్ కృష్ణ, శేఖర్ దివ్వెల
బ్యానర్లు: ఇమేజ్‌స్పార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, మైరా క్రియేషన్స్
సంగీత దర్శకుడు: వికాస్ బదిసా
ఎడిటర్: జీఆర్‌కే శరణ్ రావుల
లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, కిట్టు విస్సాప్రగడ
సినిమాటోగ్రాఫర్లు: మల్లు నాయక్, సునీల్ రెడ్డి (సెకండ్ యూనిట్ డీఓపీ)
కొరియోగ్రాఫర్: శ్రీకాంత్ రౌతు
యాక్షన్: వి. వెంకట్
సౌండ్ డిజైన్: ప్రదీప్ జి
కలరిస్ట్: ఆండ్రియాస్ బ్రూక్ల్
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మనాథ్ ఏ. పాటిల్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గిరీష్
లైన్ ప్రొడ్యూసర్: వి. జానకీ రామ్
పీఆర్ఓ: వంశీ–శేఖర్
మార్కెటింగ్: హ్యాష్‌ట్యాగ్ మీడియా
పబ్లిసిటీ డిజైన్స్: ఆర్‌సీ డిజైన్స్
మ్యూజిక్ లేబుల్: ఆదిత్య మ్యూజిక్
ఈవెంట్ పార్ట్‌నర్: యూవీ మీడియా

- Advertisement -
RELATED ARTICLES

Latest News