- మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పిలుపు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, బండరావిరాల గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 268 లో గల 494 ఎకరాల ప్రభుత్వ భూమిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయ తలపెట్టిన ‘ఏకో టౌన్’ (డంపింగ్ యార్డ్) ప్రాజెక్టును బిఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఇబ్రహీంపట్నం మాజీ శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ ప్రాజెక్టుకు నిరసనగా 29 వ తేదీ సోమవారం నాడు నిర్వహించ తలపెట్టిన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి మద్దతు కోరుతూ బండరావిరాల గ్రామ సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, జవహర్‌నగర్ తరహాలో అత్యంత ప్రమాదకరమైన చెత్త డంపింగ్ యార్డ్‌ను ఇక్కడికి తీసుకువచ్చి ఏకో టౌన్ పేరిట బండరావిరాల, చిన్నరావిరాల, పిల్లాయపల్లి, బాచారం, గౌరెల్లి, సద్దిపల్లి, తారమతిపేట, కావాడిపల్లి, బలిజగూడ వంటి దాదాపు 15 గ్రామాల పర్యావరణాన్ని పూర్తిగా కలుషితం చేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మండిపడ్డారు.
ఇక్కడ అందుబాటులో ఉన్న వేలాది ఎకరాల ప్రభుత్వ భూమిలో ఐటీ, సాఫ్ట్వేర్ లేదా హార్డ్‌వేర్ కంపెనీలను ఏర్పాటు చేస్తే స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించి ఈ ప్రాంతం ఆర్థికంగా బాగుపడుతుందని హితవు పలికారు. ఇప్పటికే మూసీ ప్రాజెక్ట్ పునరుద్ధరణ పేరుతో మర్రిపల్లి, కుత్బుల్లాపూర్, బాచారం వంటి గ్రామాల
