Friday, June 26, 2026
Homeఆజ్ కీ బాత్Aaj ki Baath | తెలంగాణ సర్పంచుల కన్నీటి గాథ…

Aaj ki Baath | తెలంగాణ సర్పంచుల కన్నీటి గాథ…

పైకి కనిపించే తెల్లటి ఖద్దరు చొక్కా వెనుక… గుండెల్ని పిండేసే అప్పుల చీకట్లున్నాయని సమాజానికి తెలియదు. ఊరి బాగు కోసం, జనం మెప్పు కోసం ఉన్నదమ్ముకుని.. ఉన్న ఊరిలోనే అప్పులపాలై.. తలదించుకుని తిరుగుతున్న సర్పంచ్’లది సేవ కాదు… ఒక నిశ్శబ్ద త్యాగం.. చేసిన పనులకు బిల్లులు రాక, అప్పులవాళ్ళ నిలదీతలను భరించలేక, బతుకు భారమై చావో రేవో తేల్చుకోలేక కొట్టుమిట్టాడుతున్న పల్లె ప్రధానుల గుండెకోతను ఆలకించేదెవరు..? ఓటు వేసి గెలిపించిన జనం ముందే.. అప్పుల ఊబిలో మునిగి, బతుకును తాకట్టు పెట్టిన ప్రజాస్వామ్య పల్లె సీమల గుండెల్లో ఒక పచ్చి పుండు..! ఈ మాటలు వారి కష్టాలను, ఆత్మగౌరవ పోరాటాన్ని సమాజం ముందుకు బలంగా తీసుకెళ్తాయని ఆశిస్తున్నాం..

  • పృథ్వీరాజ్
- Advertisement -
RELATED ARTICLES

Latest News