Homeఆదిలాబాద్Junior Doctors Protest | నిర్మల్ జూనియర్ డాక్టర్ల స్టైపెండ్ నిరసన

Junior Doctors Protest | నిర్మల్ జూనియర్ డాక్టర్ల స్టైపెండ్ నిరసన

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట జూనియర్ డాక్టర్లు (Junior Doctors Protest) తమ ప్రధాన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. తమకు రావాల్సిన స్టైపెండ్‌ చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జూనియర్ డాక్టర్ల మూడు ప్రధాన డిమాండ్లు: స్టైపెండ్ పెంపు: నెలకు రూ.29,972 చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.5,000 మాత్రమే చెల్లిస్తున్నారని పేర్కొంటూ పూర్తి మొత్తం చెల్లించాలని డిమాండ్ చేశారు.

Nirmal Junior Doctors Protest Over Stipend Delays3
Nirmal Junior Doctors Protest Over Stipend Delays
Nirmal Junior Doctors Protest Over Stipend Delays4

బకాయిల చెల్లింపు: జనవరి నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని, పెండింగ్‌లో ఉన్న స్టైపెండ్‌ను వెంటనే విడుదల చేయాలని కోరారు. దీక్ష రోజులకు వేతనం: నిరాహార దీక్షలో పాల్గొంటున్న రోజులకు కూడా జీతం చెల్లించాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని జూనియర్ డాక్టర్లు (Junior Doctors Protest) కోరుతున్నారు. డిమాండ్లు నెరవేరే వరకు దశలవారీగా ఆందోళన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.  (https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News