Monday, June 22, 2026
Homeరంగారెడ్డిJawahar Nagar | అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదు

Jawahar Nagar | అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదు

  • కాప్రా ఎమ్మార్వో మతీన్. గిర్ధవర్ సత్యనారాయణ హెచ్చరిక

జవహర్ నగర్ పరిధిలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అనుమతులు లేని అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా చేపట్టే ఎలాంటి నిర్మాణాలనైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని కాప్రా మండల రెవెన్యూ అధికారి (ఎమ్మార్వో) మతీన్ స్పష్టం చేశారు.

ఇటీవల మండల పరిధిలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మించిన కొన్ని అక్రమ కట్టడాలను రెవెన్యూ సిబ్బంది జేసీబీ సహాయంతో కూల్చివేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ, కొందరు నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా బహుళ అంతస్తులు షెడ్లను నిర్మిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.

- Advertisement -

ప్రభుత్వ భూములను కబ్జా చేయాలని చూస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.”ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో ఎలాంటి రాజీ లేదు. అనుమతులు లేకుండా రాత్రికి రాత్రే నిర్మాణాలు చేపడితే ఎంతటి వారైనా సరే చట్టపరమైన చర్యలు తప్పవు. ప్రజలు కూడా ఇలాంటి అక్రమ నిర్మాణదారులను నమ్మి మోసపోవద్దు.

“మతీన్, కాప్రా ఎమ్మార్వో రెవేన్యూ అధికారుల సమన్వయంతో మండలంలో నిరంతరం నిఘా కొనసాగుతుందని, అక్రమ కట్టడాలపై కూల్చివేతల పర్వం ఇలాగే మున్ముందు కూడా కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో ఆక్రమణలకు పాల్పడే వారిపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని రెవెన్యూ యంత్రాంగం హెచ్చరించింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News