సాలుకు.. చాలే జల్లు పడట్లే.. వట్టి గాలి వీస్తుంది కానీ…, | గట్టి చినుకు జాడ ఉండట్లే..! మబ్బు మసకేస్తుంది కానీ…. మంచి వాన కురవట్లే…!! మురిపిస్తుందీ అనునుకుంటే… కాలం ముఖం చాటేస్తుంది…! మబ్బుల మాటున ఎండ…. మళ్ళా…. వేసవిని మరిపిస్తుంది…!! కోటి ఆశలతో రైతు… ఖరీఫ్ కు సన్నద్ధమౌతుంటే…! అదునుదాటి పోతున్నా… ఇంకా సాలుకు చాలే జల్లు పడట్లే!
- బొల్లెద్దు వెంకట్ రత్నం
- Advertisement -
