బాంచెన్ బతుకు తెంచి… గోల్కొండను గెలిచి! తాళ్లు ఎక్కితే కాయకష్టం… ఒళ్లు వంచితేనే బ్రతుకు, కళ్ళు అమ్మితే కొద్దిపాటి కూలి… ఆకలి తీరే వెతుకు.. అణచివేసే కాలంలో… అలమటించే వేళలో, తన రక్తాన్ని మళ్లించి… తెగించి లేచాడు పాపన్న! “కొడితే గోల్కొండ కోటను కొట్టాలి, ఎలితే ఈ రాజ్యాన్నే ఎలాలి!” అని గర్జించిన ఆ బహుజన సింహం అడుగుజాడల్లో, తెలంగాణ నేల మళ్లీ రాజ్యాధికార కలలు కంటోంది! రావు పోయి రెడ్డి వస్తేనేమి.. పాలకులు మారితేనేమి? చెమట చిందించే బిడ్డలకు స్థానం ఏది? బీసీల కష్టం పండే కాలం ఏది? సింహాసనంపై బహుజనం కూర్చునే రోజు ఏది? సర్దార్ సర్వాయి పాపన్న చూపిన తోవలోనే, చరిత్ర మళ్లీ కొత్తగా రాయబడింది! బాంచెన్ అన్న బానిస బ్రతుకు ముగిసింది, బరి గీసి కొట్లాడే సమయం వచ్చింది! ఆలోచనల పాపన్న బల్లెం పట్టి… హక్కుల పోరు సలిపి, పాపన్న గౌడ్ జయంతి సాక్షిగా రాజ్యాధికారం సాధిద్దాం!
- ముచ్కూర్ సుమన్ గౌడ్
