అరెరే! ఊర్లల్లో నీళ్లు పారాలే, పొలాలు పండాలె అని సర్కారోళ్ల కోసం జాగలిచ్చిన పేదోళ్లకు ఏండ్లకేండ్లు పైసలియ్యకుండా ఎగ్గొడుతారా? భూములిచ్చినోళ్లకు నష్టపరిహారం ఇయ్యడం సర్కారోళ్ల ధర్మం కాదా? చట్టప్రకారం ఇయ్యాల్సినవి పక్కనపడేసి, పైసల్లేకపోయినా ఓట్ల కోసం లొల్లి చేస్తూ రూపాయి లేకుండ పథకాలకు తాయిలాలు పంచుతామంటే చూస్తూ ఊరుకోవాలా? రాష్ట్ర ఖజానా ఖాళీ అయి, నెత్తిమీద అప్పుల కొండపేరి డేంజర్ బెల్స్ మోగుతుంటే… ఇట్లనే పరిమితి లేకుండా ఉచితాలకు పైసలు తగలేస్తే రేపు మిగతా అత్యవసర రంగాల గతేం కావాలె? ముందు బాధితులకు చెల్లించాల్సిన బాకీలు కట్టండి, ఆ తర్వాతనే పథకాల ముచ్చట..
- Advertisement -
