సంజయ్ రావ్, నటాషా సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘హిట్ అండ్ రన్’. క్రైమ్, థ్రిల్లర్ జానర్‌లో రాబోతోన్న ఈ సినిమాను శ్రీ ఉరుకుంద ఈరణ్ణ స్వామి సమర్పణలో సతీష్ రెడ్డి అల్లం ఎంటర్టైన్మెంట్, శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్రియేషన్స్ బ్యానర్‌ల మీద సతీష్ రెడ్డి అల్లం, కె. శేఖర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సాయి కృష్ణ సాగర్ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన సంజయ్ రావ్ పాత్ర, ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ‘హిట్ అండ్ రన్’ కాన్సెప్ట్ తెలిసేలా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అందరిలోనూ అంచనాలు పెంచేసింది.

తాజాగా ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ‘హిట్ అండ్ రన్’ సినిమాలోని హీరోయిన్ పాత్రకు సంబంధించిన లుక్‌ను రివీల్ చేశారు. నటాషా సింగ్ ఈ సినిమాలో రిపోర్టర్ సాక్షి అనే పాత్రలో కనిపించనున్నారు. పోస్టర్‌లో కనిపిస్తున్న కారు, వెనకాల ఉన్న డీటైల్స్ అన్నీ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఇక హీరోయిన్ లుక్ కూడా చాలా డిఫరెంట్‌గా కనిపిస్తోంది. త్వరలోనే ‘హిట్ అండ్ రన్’ టీజర్‌తో అందరినీ మెస్మరైజ్ చేయనున్నారు. ఈ సినిమాకి ప్రిన్స్ హెన్రీ సంగీతాన్ని అందిస్తున్నారు. డి. వెంకట్ ప్రభు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
తారాగణం : సంజయ్ రావ్, నటాషా సింగ్, కిరీటి, మురళీధర్ గౌడ్, లిరీషా కునపరెడ్డి, రవి ప్రకాష్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ తదితరులు
సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: సతీష్ రెడ్డి అల్లం ఎంటర్టైన్మెంట్
నిర్మాతలు: సతీష్ రెడ్డి అల్లం, కె.శేఖర్
రచన & దర్శకత్వం: సాయి కృష్ణ సాగర్
సంగీత దర్శకుడు: ప్రిన్స్ హెన్రీ
కెమెరామెన్ : విజయ్ భాస్కర్ సద్దాల, ఎల్ గంగాధర్
ఎడిటర్: డి వెంకట ప్రభు.
పీఆర్వో : సాయి సతీష్
