సీజ్ల పేరుతో మాయాజాలం..
- మళ్లీ యథావిధిగా నిర్మాణాలు
- అవినీతి అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్
శేర్లింగంపల్లి సర్కిల్ పరిధిలో అక్రమ షెడ్లు, అనుమతి లేని నిర్మాణాల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. టౌన్ ప్లానింగ్ సిబ్బంది సహకారంతోనే అనేక ప్రాంతాల్లో అక్రమ షెడ్లు నిర్మించబడుతున్నాయని స్థానికులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత వారంలో ‘ఆదాబ్ హైదరా బాద’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన శేర్లింగంపల్లి టౌన్ ప్లానింగ్ ఏసీపీ వెంకటరమణ పలు అక్రమ షెడ్లను సీజ్ చేశారు. సీజ్లను తొలగించి మళ్లీ ప్రారంభమైన అక్రమ షెడ్, బిల్డింగ్ నిర్మాణ పనులు అయితే ఈచర్యలపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
గతంలో కూడా ఇదే తరహాలో అనేక షెడ్లను టౌన్ ప్లానింగ్ అధికారులు సీజ్ చేసినప్పటికీ, కొద్ది రోజులకే తిరిగి నిర్మాణ పనులు యథావిధిగా కొనసాగాయని వారు చెబుతున్నారు. దీంతో సీజ్ ప్రక్రియ కేవలం కంటి తుడుపు చర్యగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానికుల ఆరోపణల ప్రకారం, కొంతమంది టౌన్ ప్లానింగ్ అధికారులు, కింది స్థాయి సిబ్బంది సహకారంతో అక్రమ నిర్మాణాల యజమానులతో కుమ్మక్కై వ్యవహరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.



నిర్మాణా లను సీజ్ చేసినట్లు చూపించి, అనంతరం వాటిని మళ్లీ కొనసాగించేం దుకు అనుమతిస్తున్నారని, ఈ ప్రక్రియనే కొందరు శేర్లింగంపల్లి టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఆదాయ వనరుగా మార్చుకున్నారని ఆరోపిస్తున్నారు. శేర్లింగంపల్లి, నల్లగండ్ల, కొండాపూర్, గోపన్పల్లి, వెంకటేశ్వర నగర్, రాజరాజేశ్వరి కాలనీ, హెచ్ ఏ ఎల్ కాలనీ, శ్రీరామ్ నగర్ ఏ బ్లాక్ బి బ్లాక్, డిఎలఎఫ్ తదితర ప్రాంతాల్లో అనుమతులకు విరుద్ధంగా నిర్మా ణాలు కొనసాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
పలుమార్లు ఫిర్యా దులు చేసినప్పటికీ సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో చర్యలు తీసు కోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు వచ్చినప్పుడు మాత్రమే హడావుడిగా సీజ్ చర్యలు చేపట్టి, ఆ తర్వాత వాటిని వదిలేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ వ్యవహారంపై సిఎంసి విజిలెన్స్ విభాగం కూడా స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అక్రమ నిర్మాణాలపై వచ్చిన ఫిర్యా దులను నిష్పక్షపాతంగా విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన విజిలెన్స్ అధికారులు మౌనంగా ఉండటంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్, సీఎంసీ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించి టౌన్ ప్లానింగ్ విభాగంలో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలకు సహకరించిన అధికారులు, సిబ్బందిని గుర్తించి తక్షణమే సస్పెండ్ చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అక్రమ నిర్మాణాలపై శాశ్వత పరిష్కారం చూపించి, ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
