- సైబర్ నేరగాళ్లకు అమ్మి సొమ్ము చేసుకుంటున్న వైనం..
- గుజరాత్ లో వెలుగుచూసిన ఘటన..
ఒక యువకుడు ఇంటర్ మధ్యలోనే చదువు మానేశాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), టెలిగ్రామ్ ఉపయోగించి నకిలీ బ్యాంకింగ్ యాప్‌లు క్రియేట్ చేశాడు. వాటిని సైబర్ నేరగాళ్లకు అమ్మి సైబర్ మోసాలను ప్రోత్సహిస్తున్నాడు. ఒక సైబర్ మోసం కేసుపై దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. ఈ ఏడాది మే నెలలో గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఒక వ్యక్తి వాట్సాప్‌లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)ను పోలిన ఒక ఏపీకే ఫైల్ వచ్చింది.

బ్యాంక్‌కు సంబంధించిన యాప్‌గా నమ్మిన ఆ వ్యక్తి దానిని డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేశాడు. ఆ వెంటనే అతడి మొబైల్ ఫోన్ హ్యాక్ అయ్యింది. ఆ వ్యక్తికి చెందిన ఒక బ్యాంకు ఖాతా నుంచి రూ.5 లక్షలను సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టారు. కాగా, బాధిత వ్యక్తి ఫిర్యాదుపై సూరత్ సైబర్ క్రైమ్ సెల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఉత్తరప్రవేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన 18 ఏళ్ల రోహిత్ వీరేంద్ర సింగ్ షాక్య కీలక సూత్రధారిగా గుర్తించారు. జూలై 20న కాన్పూర్‌లోని హోటల్‌పై రైడ్ చేసి అతడ్ని అరెస్ట్ చేశారు. ఆ యువకుడి వద్ద ఉన్న ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్, ఇతర డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడైన రోహిత్‌ను ప్రశ్నించిన పోలీసులు అతడు చెప్పిన వివరాలు తెలుసుకుని షాకయ్యారు. ఆ యువకుడు 11 తరగతి మధ్యలోనే చదువు మానేశాడు. ఏఐ, టెలిగ్రామ్‌ను ఉపయోగించి నకిలీ బ్యాంకింగ్ అప్లికేషన్లు, మాల్‌వేర్ ఏపీకే ఫైల్స్‌ను సృష్టిస్తున్నాడు. సైబర్ నేరగాళ్లకు వాటిని అమ్ముతున్నాడు
