Friday, June 5, 2026
HomeసినిమాSigma | దుల్కర్ సల్మాన్ లాంచ్ చేసిన “సిగ్మా” మూవీ ఫస్ట్ సింగిల్

Sigma | దుల్కర్ సల్మాన్ లాంచ్ చేసిన “సిగ్మా” మూవీ ఫస్ట్ సింగిల్

సందీప్ కిషన్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘సిగ్మా’. జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం అనౌన్స్మెంట్ నాటి నుంచే సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. టీజర్‌కు అద్భుతమైన స్పందన రావడంతో మరింత హైప్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా కోసం మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. తమన్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ కంపోజ్ చేశారు.

తాజాగా హీరో దుల్కర్ సల్మాన్ ‘సిగ్మా’ ఫస్ట్ సింగిల్ ‘సిగ్మా స్టైల్’ ను లాంచ్ చేశారు. తమన్ స్వయంగా కంపోజ్ చేసి ఆలపించిన ఈ ఎనర్జిటిక్ ట్రాక్ మాస్ బీట్‌లతో అదిరిపోయింది. థమన్ సిగ్నేచర్ స్టైల్ మ్యూజిక్, హై-వోల్టేజ్ రిథమ్స్ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

- Advertisement -

సందీప్ కిషన్ తన స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్స్, ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకోగా, ఫారియా అబ్దుల్లా కూడా టు అదిరిపోయే డ్యాన్స్ స్టెప్స్‌తో పాటకు మరింత కలర్ తీసుకొచ్చింది. జేసన్ సంజయ్ రాసిన క్యాచీ లిరిక్స్, థమన్ మాస్ ట్యూన్, సందీప్-ఫారియా డైనమిక్ పెర్ఫార్మెన్స్ కలిసి ‘సిగ్మా స్టైల్’ను ఇన్‌స్టంట్ చార్ట్‌బస్టర్‌గా నిలబెట్టాయి. ఈ సాంగ్‌తో సినిమాపై క్యూరియాసిటీ, ఎక్స్‌పెక్టేషన్స్ మరింతగా పెరిగాయి.

ఈ చిత్రంలో రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అంబు దాసన్, యోగ్ జాపీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రానికి కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. హరిహరసుతన్ వీఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్‌గా వ్యవహరిస్తున్నారు. చిత్ర ఆడియో హక్కులను సరేగమా సొంతం చేసుకోగా, డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది.

సిగ్మా ప్రపంచవ్యాప్తంగా జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News