Homeరంగారెడ్డిToddy | కల్లుగీత వృత్తి అభివృద్ధికి ఆధునిక మార్పులు అవసరం

Toddy | కల్లుగీత వృత్తి అభివృద్ధికి ఆధునిక మార్పులు అవసరం

  • చౌగాని సీతారాములు!!

ప్రకృత పానీయం కల్లు వలన ప్రజల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. దీనిపై ఆధారపడి జీవిస్తున్న గీతా కార్మికులకు ఉపాధి కలుగుతుంది. చెట్లు ఎవరి భూమిలో ఉన్న వాటిపై గీత కార్మికులకు హక్కు ఉంటుందని చట్టం చెబుతుంది. దీనికి ఎలాంటి భంగం కలవకుండా ఆధునీకరణ పద్ధతులలో తాడి బార్లు నీరా కేఫ్లు స్టాళ్లు ఏర్పాటు చేయాలి. గీసే పద్ధతిలో మార్పులు తేవాలి అందుకని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించి తగన చర్యలు తీసుకోవాల్సిందిగా కల్లుగీతా కార్మిక సంఘం నల్లగొండ జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని కోరుతుంది.

ఈ జిల్లాలో తాటి ఈత చెట్ల సంపదలను ప్రకృతి అందించింది దీనిపై 20 వేల కుటుంబాలు ఈ జిల్లాలో కళ్ళు గీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనుసరిస్తున్న ఎక్సైజ్ విధానం కల్లు గీత వృత్తిని దెబ్బతిస్తుంది లిక్కర్ అమ్మకాలు పెంచి ఖజానా నింపుకుంటున్నారు. ఫలితంగా కల్లుగీత కార్మికుల ఉపాధి కోల్పోయి ఇతర పనులు ఎత్తుకోవలసిన పరిస్థితి దాపురించింది. ఆరోగ్యానికి నష్టం చేకూర్చే కార్పొరేట్ లిక్కర్ కంపెనీల యజమానులు కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును దండుకుంటున్నారు. ఈ జిల్లాలో సమృద్ధిగా చెట్ల సంపద ఉన్నది వేలమంది మంది వృత్తి చేసేవారు ఉన్నారు.

- Advertisement -
Toddy Tapper Profession Modernization Employment Demand Nalgonda 1

మారుతున్న కాలానికి అనుగుణంగా వృత్తిలో ఆధునిక పద్ధతులు తీసుకొచ్చి పోటీ ప్రపంచంలో నిలబడే విధంగా తగిన ప్రణాళిక ప్రభుత్వం రూపొందించి వృత్తిలో ఉపాధి అవకాశాలను కల్పించాలని ఆయన డిపాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షులు కొండా వెంకన్న మాట్లాడుతూ ఈ జిల్లాలో ఉన్న కల్లుగీత కార్మికులు 50 సంవత్సరాలు నిండిన ప్రతి కల్లుగీతా కార్మికుడు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

Toddy Tapper Profession Modernization Employment Demand Nalgonda

అదేవిధంగా జిల్లాలో పెండింగ్లో ఉన్న ఎక్స్పీరియా నిధులు విడుదల చేయాలని ఈ మధ్యకాలంలో ఈ జిల్లాలో తాటి ఈత చెట్లను నరికి వేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకొని చట్టబద్ధంగా చట్టబద్ధంగా శిక్షించాలి శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు నర్సింగ్ సైదులు, జిల్లా ఉపాధ్యక్షులు వేములకొండ పుల్లయ్య, తిరుమలగిరి మండల అధ్యక్షులు గుండు శ్రీనివాస్, కనగల్ మండల అధ్యక్షులు సుడిగాల యాదయ్య, కాట్నం పరమేష్ , కాసాని సత్తయ్య, కట్నం నవీన్ కుమార్, వడ్డగోని వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News