- 560 పైగా మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రామోజీ ఫిల్మ్ సిటీ విద్యా విహారయాత్ర
మెదక్ జిల్లాలో మార్చి–2026 పదవ తరగతి ఫలితాల్లో 560 మరియు అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల 70 మంది విద్యార్థులకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక ప్రోత్సాహకంగా హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీకి ఒకరోజు విద్యా విహారయాత్రను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మంగళవారం ఉదయం 7 గంటలకు మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుండి ప్రత్యేక వాహనాల్లో రామోజీ ఫిల్మ్ సిటీ సందర్శనకు ఉత్సాహంగా బయలుదేరారు.
విద్యాశాఖ సిబ్బంది విద్యార్థులకు ఎస్కార్ట్‌గా వెళ్లి పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఇటువంటి వినూత్న నిర్ణయం తీసుకున్న గౌరవ జిల్లా కలెక్టర్ గారికి విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అలాగే జిల్లా విద్యాశాఖ అధికారి రాజు గారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విహారయాత్రలో జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి సాధు సుదర్శన్ మూర్తి, ఏపీఓ రమేష్, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ బాలలక్ష్మి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
