రాజకీయ పార్టీల విధానం సిద్ధాంతాల ముసుగులో అధికార పీఠాల కోసం కుమ్ములాడుకోవడం కాదు.. సమాజంలోని చివరి వ్యక్తికీ సంక్షేమ ఫలాలను అందించడం. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్టీలు అనేవి ‘ప్రజల గొంతుకలు’ కావాలి గానీ.. సొంత లాభాల కోసం ప్రాకులాడకూడదు.. ఎప్పుడైతే పార్టీల అంతర్గత కుమ్ములాటలు ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తాయో.. ఎప్పుడైతే ప్రజా సంక్షేమం కంటే నాయకుల స్వార్థ ప్రయోజనాలే ప్రాధాన్యత సంతరించుకుంటాయో.. అప్పుడు ఆ వ్యవస్థ తన నైతికతను కోల్పోతుంది.. అసలు రాజకీయ పార్టీలు ఉన్నది దేశాన్ని, సమాజాన్ని ముందుకు నడిపించే పవిత్రమైన బాధ్యతను మోయడానికి.. ఇది గుర్తుపెట్టుకోండి..
- బీవీఆర్ రావు..
- Advertisement -
