Homeఆదిలాబాద్Sai Bhojan | ప్రపంచ కుటుంబ వైద్యుల దినోత్సవం

Sai Bhojan | ప్రపంచ కుటుంబ వైద్యుల దినోత్సవం

  • సాయి భోజన్
  • గర్భిణులకు బాలింతలకు డయాలసిస్ పేషెంట్లకు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం కార్యక్రమం
  • బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహణ

ప్రపంచ కుటుంబ వైద్యుల దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ సహకారంతో గర్భిణులకు బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్తులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ – రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని, గర్భిణీలు, బాలింతలు, రోగులు, అన్నార్తులు, ఆసుపత్రి సిబ్బంది, సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ, బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Sai Bhojan food donation program at Bellampalli Government Hospital serving pregnant women dialysis patients and new mothers on World Family Doctors Day1 1

ట్రస్ట్ ద్వారా “ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం-అన్నదానంతో తృప్తి పరుద్దాం” అని ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్-రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని,మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య, శ్రవిద్య, త్రయాక్షర్ సూచించారు ఈ సేవా కార్యక్రమములో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు, రాజేశ్వరి జేరిపోతుల,చంద్రకళ ఒడ్డూరి రాజకుమారి,సేవకులు పోతురాజుల తిరుపతి, ఉప్పట్ల భీమయ్య,తదితరులు పాల్గొన్నారు. బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా అన్నదానం, సాయం అందించాలని అనుకునేవారు ట్రస్ట్ మేనేజర్ 8106550532, ఫౌండర్స్ 9959269975, 9949041595 సంప్రదించాలని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News