Homeమెదక్‌Farmers Protest | చిట్కూల్ లో రోడ్డెక్కిన అన్నదాతలు..

Farmers Protest | చిట్కూల్ లో రోడ్డెక్కిన అన్నదాతలు..

  • లారీలు రాక.. ధాన్యం పోక..
  • మెదక్-జోగిపేట రహదారిపై రాస్తారోకో
  • రాస్తారోకోతో నిలిచిపోయిన వాహనాలు

ధాన్యం తరలించేందుకు లారీలు ఏర్పాటు చేయడం లేదని మంగళవారం మండల పరిధిలోని చిట్కూల్ రైతులు రోడ్డు ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. దీంతో మెదక్-జోగిపేట ప్రధాన రహదారి పై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.ధాన్యం తరలింపులో లారీలు ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలం అయ్యారని,లారీలు రాకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం బస్తాలు రాత్రి కురిసిన వర్షానికి తడిసి ముద్దయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.కొనుగోలు కేంద్రాల నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు.

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు పేరుకుపోతుండగా,వాటిని తరలించేందుకు అవసరమైన లారీలు అందుబాటులో లేక రైతులు రోడ్డెక్కే పరిస్థితి నెల కొందని ఆవేదన వ్యక్తం చేశారు.రోజుల తరబడి ధాన్యం తూకం కాకపోవడంతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన రైతులు రాత్రింబవళ్లు అక్కడే కాపలా కాస్తున్నామన్నారు.తూకం పూర్తైన ధాన్యాన్ని మిల్లులకు తరలించకపోవడంతో కొత్తగా వచ్చిన ధాన్యానికి స్థలం లేక కేంద్రాలు కిక్కిరిసిపోయాయని వాపోయారు.లారీలు సరిపడా ఏర్పాటు చేయడంలో అధికారుల వైఫల్యం కారణంగా సమస్య మరింత తీవ్రమైందని రైతులు ఆరోపిస్తున్నారు.

- Advertisement -
Chitkul Farmers Protest Grain Transportation Delay Medak Jogipet Highway Blockade2

హమాలీలు,వాహనాల కొరతగా ఉండటంతో లోడింగ్ పనులు నెమ్మదిగా సాగుతున్నాయని,ధాన్యం తరలించిన లారీలు మిల్లులలో ధాన్యం బస్తాలు దింపుకోవడం లేదని దీంతో ఒక్కో మిల్లు వద్ద పదుల సంఖ్యలో లారీలు ధాన్యం బస్తాలతో వారం రోజుల పాటు నిలిచి పోతుండడంతో లారీల కొరత ఏర్పడిందని,నిర్వాహకులు నచ్చజేప్పే ప్రయత్నం చేసినప్పటికి రైతులు వినకపోవడంతో ఈ విషయం తెలుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని రైతులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.లారీలు కేంద్రానికి సమకూర్చుతానని తెలుపడంతో శాంతించిన రైతులు నిరసనను విరమించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News