Monday, May 18, 2026
Homeఆంధ్రప్రదేశ్Perni Nani | ఆర్టీసీని అధోగతి పాలు చేస్తున్నారు..

Perni Nani | ఆర్టీసీని అధోగతి పాలు చేస్తున్నారు..

  • మండిపడ్డ మాజీ మంత్రి పేర్ని నాని..
  • ఏకంగా రూ. 3.50 లక్షల కోట్ల మేర అప్పులు చేశారు..

కూటమి పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, శాంతిభద్రతలపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. గడిచిన రెండు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఏకంగా 3.50 లక్షల కోట్ల రూపాయల మేర అప్పులు చేసిందని ఆయన దుయ్యబట్టారు. కేవలం అప్పుల్లోనే కాకుండా… దేశంలోనే నేరాలు, నిరుద్యోగ రేటులో కూడా ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని విమర్శించారు. రాష్ట్ర సంపద అంతా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, అధికార పార్టీ ఎమ్మెల్యేల చేతుల్లోకే వెళ్తోందని ఆయన ఆరోపించారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, ఉద్యోగులకు భద్రత కల్పించడమే కాకుండా సంస్థను ఆదుకున్నామని ఆయన గుర్తుచేశారు. అయితే ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అందుకు పూర్తి భిన్నంగా ఆర్టీసీని అమ్మేయడానికి చూస్తోందని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తున్నందుకే సంస్థ నష్టపోతోందనే నెపాన్ని వారిపై నెట్టి, ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.

- Advertisement -

కేంద్ర ప్రభుత్వ ‘పీఎం ఈ-బస్ సేవ’ కింద ఆర్టీసీలోని 10 వేల బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తామనడం సరైన నిర్ణయం కాదని, ఇది సంస్థను నిర్వీర్యం చేసే ప్రక్రియలో భాగమేనని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రజల ఆస్తులు సురక్షితంగా ఉండవని విమర్శించారు. గతంలో 2004 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గనుక ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే, చంద్రబాబు ఆ కాలంలోనే ఆర్టీసీని పూర్తిగా అమ్మేసి ఉండేవారంటూ నాటి రాజకీయ పరిణామాలను పేర్ని నాని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News