Homeఆదాబ్ ప్రత్యేకంAlwal | తుతూ మంత్రంగా నోటీసులు..

Alwal | తుతూ మంత్రంగా నోటీసులు..

  • ఆఫీసర్లు ఎలా చెప్తే అలా చేస్తాం అంటున్న న్యాక్ ఇంజనీర్స్

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ అల్వాల్ సర్కిల్ పరిధిలోని బొల్లారం మెయిన్ రోడ్ పైన నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలు, నోటీసులు ఇచ్చిన డోంట్ కేర్.. గల్లీలో విచ్చల విడిగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా పట్టించుకునే నాధుడే లేడు. ముఖ్యంగా మచ్చబొల్లారం డివిజన్ పరిధిలోని నిబంధనలను తుంగలో తొక్కుతున్న న్యాక్ ఇంజనీర్స్. అక్రమ నిర్మాణాలు అడ్డుకోవాల్సిన అధికారులే వీటికి వత్తాసు పలుకుతు న్నారని స్ధానికంగా విమర్శలు వెలువడుతున్నాయి.

Alwal Circle Illegal Constructions and Town Planning Notice Allegations3jpg

నిబం ధనలను అతిక్రమిస్తూ, అను మతులు లేకుండానే బహుళ అంతస్థుల భవనాలు చేపడుతున్నా ఇక్కడ అధికారులు మాత్రం మాకేం సంబంధం లేదన్న ట్లుగా వ్యవహరిస్తుం డటం స్ధానికంగా చర్చనీ యాంశ మైంది. దీంతో చట్టం తన పని తాను చేసుకు పోతుందని భావించే సామాన్య ప్రజలకు టౌన్ ప్లానింగ్ అధికారుల పని తీరుపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.

- Advertisement -

డీవియేషన్స్, సెట్ బ్యాక్స్ నిబంధనలు పాటించకుండా నిర్మాణ దారులు అంతా తమ ఇష్టారాజ్యంగా వ్యవహ రిస్తూ నిర్మాణాలు సాగిస్తుండటంతో అధికారులు మాత్రం మామామియా అంటూ అందినకాడికి దండుకుంటూ జీహెచఎంసీ ఆదాయానికి గండికొట్టడంలో తమ వంతు ప్రయత్నాలు జోరుగా కొనసాగిస్తున్నారని స్ధానికంగా ఆరోపణలు న్నాయి.

Alwal Circle Illegal Constructions and Town Planning Notice Allegations

దీంతో ఇక్కడ అంతా మా ఇష్టం.. అనే ధీమాతో ఇక్కడ నిర్మాణదారులు వ్యవహరిస్తుండటం గమనార్హం. ఎప్పుడైనా ఎవరైనా ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేస్తే మాత్రం, అధికారులు సదరు నిర్మాణానికి నోటీసులు జారీ చేసి చేతులు దులుపు కుంటున్నారు. అయితే ఇంటి యజమానులు మాత్రం డోంట్ కేర్ అంటూ నోటీసులు చింపేసి, పరదాల మాటున విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు ఇటు వైపు కన్నెత్తి చూడరని, ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ ఇంజనీర్ నాయక్ తీరుపై స్ధానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Alwal Circle Illegal Constructions and Town Planning Notice Allegations2

ఎవరైనా ప్రశ్నిస్తే మేము అధికారులతో మాట్లాడు కున్నామని, ఇంటి యజమానులు నిర్లక్ష్యంగా సమాధాన మివ్వడం గమనార్హం. అధికారులు క్షేత్రస్థాయికి వచ్చి అక్రమ నిర్మాణాలను పరిశీలించక పోవడం, నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం. వంటి చర్యలు అక్రమార్కులకు వరంగా మారాయి. అధికారుల పరోక్ష సహ కారంతోనే ఈ అక్రమ నిర్మాణాల దందా జోరుగా కొనసాగుతోందనే ఆరోపణలు బలంగా వినిపిస్తు న్నాయి.

ఇకనైనా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు అనుమతులు లేని నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని,అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్న సిబ్బందిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని స్ధానికులు కోరుతున్నారు. (టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వివరణ కోరగా మా దృష్టికి వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం)

- Advertisement -
RELATED ARTICLES

Latest News