- గౌనికాడి రాములు యాదవ్
- బీసీ కులాల ఐక్య వేదిక కన్వీనర్
కొత్తకోట మండల కేంద్రంలో ఈ నెల 31న నిర్వహించనున్న బహుజనుల రాజ్యాధికార సభను విజయవంతం చేయాలని బీసీ కులాల ఐక్య వేదిక నాయకులు పిలుపునిచ్చారు. ఈ సభకు ముఖ్య అతిథిగా డాక్టర్ విశారాధన్ మహారాజ్ హాజరుకానున్నారు అని తెలిపారు. ఎవరి కుల జనాభా – రాజ్యాధికారంలో వారి వాటా అనే నినాదంతో, ఓటు చైతన్యం మరియు సామాజిక న్యాయం సాధన లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా సభకు సంబంధించిన గోడ పత్రికను కొత్తకోట మండల కేంద్రంలో బీసీ కులాల ఐక్య వేదిక కన్వీనర్ గౌనికాడి రాములు యాదవ్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, బహుజన వర్గాల రాజకీయ, సామాజిక హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వివిధ బీసీ సంఘాల నాయకులు బోయేజ్ కౌన్సిలర్ ,మాజీ వార్డు మెంబర్ వెంకటన్న గౌడ్ ,బీమన్న నాయుడు ,బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు హనుమంత్ యాదవ్ కొత్త గంగాధర్ ముదిరాజ్ శివ శంకర్ గట్టన్న విజయ్ కుమార్ హరి కృష్ణ డిఎస్పి నరేష్ మహారాజ్ ఖాజా యువజన ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
