- బాధిత కేవ సభ్యుడికి రూ.10 వేల ఆర్థిక సాయం
(కేవ) కరీంనగర్ ఎలక్ట్రికల్ వైండింగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు కంది కృష్ణారెడ్డి 63వ జయంతిని పురస్కరించుకొని కేవ, సాయి కృష్ణ ఎలక్ట్రికల్స్, శ్రీ సప్తగిరి లయన్స్ క్లబ్, శివ ఎలైట్ కిడ్నీ సెంటర్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేవ జిల్లా అధ్యక్షులు దొంత రవీందర్ మాట్లాడుతూ, కేవ సంఘ సభ్యుడు నాయిని మల్లేశం (చర్లబూత్కూర్) కొంతకాలంగా పెరాలసిస్‌తో బాధపడుతూ కుటుంబ పోషణలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని తెలిపారు.
ఈ విషయం తెలుసుకున్న కంది కృష్ణారెడ్డి కుమారులు కంది రామ్ రెడ్డి, కంది శ్యామ్ రెడ్డి మల్లేశంకు రూ.10 వేల ఆర్థిక సాయం అందించారని పేర్కొన్నారు. అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సభ్యుడికి తోడుగా నిలిచిన కంది రామ్ రెడ్డి, కంది శ్యామ్ రెడ్డి సేవాభావాన్ని ఈ సందర్భంగా దొంత రవీందర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు పామరాజు రామారావు, గడప కోటేష్, వెంకన్న, కేవ అధ్యక్షులు దొంత రవీందర్, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.
