Monday, May 11, 2026
Homeఆరోగ్యంFatigue | రోజంతా నీరసంగా ఉందా..?

Fatigue | రోజంతా నీరసంగా ఉందా..?

  • ఈ చిట్కాలు పాటించండి సెట్ అవుతుంది..

ఉదయం నిద్రలేచినప్పటి నుంచే అలసటగా అనిపించడం, రోజంతా నీరసంగా ఉండటం, ఏ పని చేసినా త్వరగా శక్తి తగ్గిపోవడం వంటి సమస్యలను చాలామంది మహిళలు సాధారణంగా తీసుకుంటుంటారు. ఇంటి పనులు, ఉద్యోగ ఒత్తిడి, నిద్రలేమి కారణంగానే ఇలా జరుగుతుందని భావిస్తారు. అయితే నిరంతర అలసట వెనుక శరీరంలో జరుగుతున్న కొన్ని ముఖ్యమైన మార్పులు కారణమై ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా ఐరన్ లోపం, హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్ సమస్యలు, ఒత్తిడి వంటి అంశాలు మహిళల శక్తిస్థాయిలపై తీవ్ర ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. శరీరానికి అవసరమైన ఆక్సిజన్‌ను కణాలకు చేరవేయడంలో ఐరన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఐరన్ తక్కువగా ఉన్నప్పుడు హిమోగ్లోబిన్ స్థాయిలు పడిపోతాయి.

- Advertisement -

దీంతో అలసట, బలహీనత, తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ముఖ్యంగా భారతదేశంలో మహిళల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉందని ఆరోగ్య సర్వేలు చెబుతున్నాయి. తక్కువ స్థాయి ఐరన్ లోపం ఉన్నప్పటికీ అలసట తీవ్రంగా అనిపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. నిరంతర అలసటను తగ్గించడానికి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, ఐరన్, థైరాయిడ్ స్థాయిలను పరిశీలించడం, సమతుల ఆహారం తీసుకోవడం, ఒత్తిడిని నియంత్రించడం, సరైన నిద్రపోవడం చాలా ముఖ్యమని సూచిస్తున్నారు.

వైద్యుల సలహా లేకుండా సప్లిమెంట్లు తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. నిరంతర అలసటను సాధారణ సమస్యగా తీసుకోవడం సరైంది కాదని ఇది శరీరం ఇచ్చే హెచ్చరిక సంకేతంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. సరైన సమయంలో కారణాన్ని గుర్తించి చికిత్స తీసుకుంటే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను నివారించడంతోపాటు జీవన నాణ్యతను మెరుగుపరచుకోవచ్చని వారు సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News