- రెడ్డిమల్లె పార్వతి ఠీ నియమించిన యూనియన్ ఫౌండర్..
భారత్ ఆన్ ఆర్గనైజ్డ్ కార్మిక యూనియన్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలుగా రెడ్డిమల్లె పార్వతిని నియమించారు. ఈ మేరకు యూనియన్ ఫౌండర్ చెన్నయ్య ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. మహిళల సంక్షేమం, సామాజిక సేవా కార్యక్రమాలలో ఆమె చేస్తున్న సేవలను గుర్తిస్తూ ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా రెడ్డిమల్లె పార్వతి మాట్లాడుతూ. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన యూనియన్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారం, మహిళల సాధికారత కోసం నిరంతరం పని చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు, మహిళా ప్రతినిధులు, పలువురు సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు..
- Advertisement -
