Tuesday, May 5, 2026
Homeమెదక్‌Kavitha | పెద్దమ్మ తల్లి దయతో తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలి

Kavitha | పెద్దమ్మ తల్లి దయతో తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలి

  • టి ఆర్ ఎస్ అధ్యక్షురాలు కవిత
  • ప్రజల దీవెనలే పార్టీకి బలం
  • ఘనంగా స్వాగతం పలికిన గ్రామస్తులు

పెద్దమ్మ తల్లి దయతో తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని మీ దీవెనలే పార్టీకి బలమని టిఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) అధ్యక్షురాలు కవిత అన్నారు. ఈ సందర్భంగా జగదేవపూర్ మండలంలోని పలుగడ్డ గ్రామంలో మంగళవారం రోజున నూతనంగా వెలసిన పెద్దమ్మ తల్లి ఆలయాన్ని ఆమె దర్శించుకుని పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీని ఆవిర్భవించిన తర్వాత మొట్ట మొదటిసారిగా పెద్దమ్మ తల్లిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.

దేవాలయాలను దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆమెను ఆప్యాయతంగా పలకరిస్తున్నారని ఏ గుడికి వెళ్లిన బండారితో స్వాగతం పలుకుతున్నారని అన్నారు బండారి రంగే వారి పార్టీ రంగు అని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని తెలంగాణ రక్షణ సేన సమితి అధ్యక్షురాలు కవిత అన్నారు. తెలంగాణ రక్షణ సేన అంటే ప్రతి ఒక్కరికి న్యాయం చేయడానికి పార్టీ ఆవిర్భవించిందని ఈ పార్టీలో అందరికీ గుర్తింపు ఉంటుందని కూడా అన్నారు. వారితో పాటు రాష్ట్ర నాయకులు కొట్టాల యాదగిరి మరియు కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News