Tuesday, May 5, 2026
Homeవరంగల్‌Vandalism | పురాతన గుడి ధ్వంసం…

Vandalism | పురాతన గుడి ధ్వంసం…

  • బంగారం కోసమా అని గ్రామస్తుల అనుమానం…
  • బహిర్గతం చేయాలని అధికారులను వేడుకుంటున్న గ్రామస్తులు

పురాతన గుడిని దుండగులు ధ్వంసం చేశారు. బంగారం కోసమా లేదా ఇతరత్రా కార్యక్రమాల కోసం ఎందుకోసం వెలనాటి గుడిని ధ్వంసం చేశారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్లోని ఖానాపురం మండలంలోని అశోక్ నగర్ గ్రామంలోని స్థానిక సైనిక స్కూల్ ఎదురుగా సుమా రు నాటి కాకతీయులు ఏలిన కాలంలో పాకాల సరస్సును నిర్మించిన కాలంలోనే ఈ కోట గండి గుడిని నిర్మించారని పలువురు పేర్కొంటున్నారు.

అలాంటి గుడి గత 50 ఏళ్ల క్రితం నుండి ధూప దీప నైవేద్యాలకు నోచుకోకపోవడంతో శివలింగంతో పాటు గుడి మొత్తం ధ్వంసం అయిందని పలువురు వాపోతున్నారు. కాగా గత 45 రోజుల క్రితం నుండి అశోక్ నగర్ గ్రామం పాతగుళ్లలో పెద్ద ఎత్తున బంగారం దొరికిందని విస్తృత ప్రచారం సాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో గుడి ధ్వంసం కావడం వెనుక ఏమై ఉంటుందని పలువురు వాపోతున్నారు. పోలీసులు రెవెన్యూ పురావస్తు శాఖల అధికారులు గుడి ధ్వంసం వెనుక ఉన్న రహస్యాలను సేధించి బహిర్గతం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News