Tuesday, May 5, 2026
Homeకరీంనగర్Unity | హిందూ ఏక్తా యాత్రను విజయవంతం చేయండి

Unity | హిందూ ఏక్తా యాత్రను విజయవంతం చేయండి

  • బిజెపి పార్టీ పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాల్రెడ్డి పిలుపు

కరీంనగర్ రేకుర్తి లోని ఇందిరమ్మ కాలనీలో బిజెపి పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాల్రెడ్డి ఆధ్వర్యంలో హిందూ ఏక్తా యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు నెల12వ తేదీన హనుమాన్ జయంతిని పురస్కరించుకొని నగర కేంద్రంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ నిర్వహించే హిందూ ఏక్తా యాత్రను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కాలనీలోని ఇంటింటికి వెళుతూ బొట్టు పెట్టి ఆహ్వానించారు కుటుంబ సభ్యులతో కలిసి సాయంత్రం నాలుగు గంటలకు వైశ్య భవన్ నుండి ప్రారంభమయ్యే హిందూ ఏక్తా యాత్రకు తరలి రావాలని కోరారు.

ఏక్తా యాత్ర లో భాగంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారని దేవుళ్ళ విగ్రహాలతో ప్రదర్శన ఉంటుందని అన్నారు అన్ని కుల సంఘాల వారు మహిళలు యువకులు కలిసి హిందువులు ఐక్యత చాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు గుజ్జ శ్రీనివాస్, పొన్నాల రాము, పర్వతం మల్లేశం, అన్నాజీ వినీత్, మమత, స్వరూప, అశోక్, విష్ణు ప్రసాద్ రావు, హనుమాన్ భక్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News