- లంచం తీసుకుంటుండగా ఏసీబీ దాడి..
- కేసు దర్యాప్తు చేసున్న అధికారులు..
లంచం డిమాండ్ చేసిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని ఈస్ట్ షాలిమార్ బాగ్ లో ఓ ఇంటి నిర్మాణానికి బదులుగా లంచం డిమాండ్ చేసినందుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారిని అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఢిల్లీలోని అవినీతి నిరోధక శాఖ హెడ్ జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ మధుర్ వర్మ తెలిపిన వివరాలు, తూర్పు షాలిమార్ బాగ్ లో నివాసం ఉంటున్న సౌరభ్ జైన్ అనే వ్యక్తి ఇంటిని నిర్మించాలనుకున్నాడు.
ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్మాణానికి అనుమతి కోసం మున్సిపల్ అధికారి నారాయణ్ ను ఆశ్రయించాడు. దీంతో అతడు రూ. లక్ష డిమాండ్ చేశాడు. లంచం ఇచ్చేందుకు ఇష్ట పడని సౌరభ్ అన్నయ్య రాజీవ్ మంగళవారం అవినీతి నిరోధక శాఖ కార్యాలయాన్ని సందర్శించారు. తగిన బేరసారాల తర్వాత రూ.10వేలకు నారాయణ ఒప్పుకున్నట్లు రాజీవ్ చెప్పినట్లు జేసీపీ తెలిపారు.
