ఓ యువత మేలుకో
నీ గమ్యం చేరుకో
అనుకున్న లక్ష్య
సాధనకు ముందడుగు
వేయి
ధైర్యమే ఆయుధంగా
సాహసమే ఊపిరిగా
ఫలితాల పైదృష్టి పెట్టు
అలసట పక్కన పెట్టు
పట్టుదల నీ పెట్టుబడి
కావాలి
ప్రగతి పురోగతి
నీ దారి కావాలి
జీవితంలో చాలా విషయాలు
నేర్చుకోవడం సులభమే
కాని వాటిలో నైపుణ్యం
సాధించడమే కష్టం
నైపుణ్యానికి అడ్డు కట్ట వేసేది
పనితనం పట్టుదల లోపించడం
నిరాశ నిస్పృహలు వాయిదా
తత్వం అభివృద్ధికి నిరోధక
శక్తులౌతాయి
నిరంతర సాధన అందరికంటే
నిన్ను ఉత్తమునిగా నిలుపుతుంది
నిరంతర సాధనతో నీ చరిత్ర
నువ్వే రాసుకోవాలి
మొదటిసారీ తడబడితే భయపడకు
ఓటమి ఎదురైతే వెనకడుగు వేయకు
ఓటమి జీవితానికి పాఠం
గుణపాఠం నేర్పుతుంది
ఓటమి వల్ల వచ్చిన అనుభవం
భవిష్యత్తు కార్యానికి దిక్సూచి
అవుతుంది
ప్రతి రోజు చేసే చిన్న ప్రయత్నమే
రేపు నిన్ను గెలుపు తీరాలకు
చేర్చుతుంది
కంప్యూటర్ కోడింగ్ అయిన
ఆటల మైదానమైన
కళల ప్రపంచమైన
వ్యాపార రంగమైన
నైపుణ్యం అనేది పుట్టుకతో
రాదు నువ్వు చేసే ప్రాక్టీస్ తోనే
అది నీసొంతమవుతుంది
కాలం విలువ తెలుసుకో యువత
కష్టపడే తత్వమే నీ ఆయుధం
కావాలి పనిని దైవంగా భావించాలి
శ్రమయేవ జయతే నీ జీవన శైలి
అవుతే ఆర్థిక వికాసం సిద్ధిస్తుంది
నిరంతర సాధనను నువ్వు
నమ్ముకుంటే విజయం
నీ కాళ్ళచెంత దాసోహమంటుంది
ఓ యువత ?
సోమరితనం వదులు
లే ?ప్రగతి పదం వైపు పరుగెత్తు
నైపుణ్యాభివృద్ధితో
వికసిత భారత్ లక్ష్యసాధనకు
ఉద్యమించు
