Sunday, May 3, 2026
Homeభక్తిAarti | ధూపం, దీపం, నైవేద్యం ప్రధానం..

Aarti | ధూపం, దీపం, నైవేద్యం ప్రధానం..

  • కాంతి ద్వారా భగవంతుణ్ణి పూజించడం హారతి పరమార్ధం..
  • కర్పూర హారతి శ్రేష్టమని చెబుతారు..

ఇళ్లలో నిత్యం పూజలు చేస్తుంటాం. చివర్లో కర్పూర హారతి సమర్పిస్తుంటాం. ధూపం, దీపం, నైవేద్యం పూజల్లో ప్రధానం. అయితే, పూజలో ధూపదీపాలను వెలిగించడం, ఆ తర్వాత హారతి ఇవ్వడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశాలు ఏమిటంటే.. కాంతి ద్వారా భగవంతుడిని ధ్యానించడమే హారతి పరమార్థం. ఇలాంటి హారతి ఇస్తున్నప్పుడు వెదజల్లే వెలుగు అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. మనసులోని చెడు ఆలోచనల్ని తొలగించడంతో పాటు ఆధ్యాత్మికత, సానుకూల దృక్పథాన్నీ పెంచుతుంది.

కొంత మంది కర్పూరంతో మరికొందరు నెయ్యి దీపంతో హారతి ఇస్తుంటారు. ఇందులో కర్పూర హారతి శ్రేష్ఠమని పెద్దలు వెల్లడించారు. పూర్తిగా కరిగిపోయే కర్పూరం అహంకార నిర్మూలన, కోరికలపైన నియంత్రణకు సంకేతం. ఎలాంటి కోరికలు లేకుండా భగవంతుడిని ధ్యానించడమే హారతి ప్రధాన ఉద్దేశం. స్వచ్ఛమైన కర్పూరం వెలిగించడం వల్ల క్రిమి కీటకాలు నశించడంతో పాటు ఇల్లంతా సువాసన వెదజల్లుతుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News