Sunday, May 3, 2026
Homeక్రైమ్ వార్తలుLiquor Scam | ఏపీ లిక్కర్ స్కాములో కీలక మలుపు..

Liquor Scam | ఏపీ లిక్కర్ స్కాములో కీలక మలుపు..

  • రంగంలోకి దిగిన ఆదాయపు పన్ను శాఖ..
  • పక్కా సమాచారంతో లోతైన విచారణ..

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. రాష్ట్ర పోలీసుల దర్యాప్తు, ఈడీ, ఎస్‌ఎఫ్‌ఐఓ విచారణల తర్వాత ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ రంగంలోకి దిగడంతో ప్రకంపనలు మొదలయ్యాయి. భారీ స్థాయిలో పన్ను ఎగవేత, నగదు అక్రమ మళ్లింపు జరిగిందన్న పక్కా సమాచారంతో అధికారులు లోతైన విచారణ ప్రారంభించారు.

ఈ కుంభకోణం విలువ దాదాపు రూ. 3,500 కోట్లు ఉంటుందని ప్రాథమిక అంచనా. ఇందులో సుమారు రూ. 2,000 కోట్ల వరకు లెక్కల్లో చూపని నగదు సృష్టించినట్లు ఆదాయపన్ను శాఖ అనుమానిస్తోంది. ప్రతి మద్యం బ్రాండ్‌పై 15 నుంచి 20 శాతం వరకు కిక్‌బ్యాక్స్ వసూలు చేసినట్లు సమాచారం. కేవలం ఈ కమీషన్ల రూపంలోనే నెలకు రూ. 70 నుంచి రూ. 80 కోట్ల వరకు అక్రమ సొమ్ము చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి.

- Advertisement -

నిందితులు నగదు తరలింపు కోసం అత్యంత రహస్య పద్ధతులను పాటించినట్లు దర్యాప్తు సంస్థలు నిర్థారణకు వచ్చాయి. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, నానక్రామ్‌గూడ వంటి విలాసవంతమైన ప్రాంతాలను కేంద్రాలుగా మార్చుకున్నారు. అక్రమ నగదును హవాలా మార్గాల్లో దుబాయ్ వంటి విదేశాలకు మళ్లించినట్లు ఆధారాలు లభిస్తున్నాయి.

ముడి సరుకుల మోసం: బాటిళ్లు, క్యాప్‌ల కొనుగోలులో మార్కెట్ ధర కంటే 3 నుండి 5 రెట్లు ఎక్కువ రేటు చూపించి, ఆ అదనపు మొత్తాన్ని బ్లాక్ మనీగా మార్చినట్లు దర్యాప్తులో తేలింది. డిజిటల్ ఆధారాలు దొరక్కుండా నిందితులు VPNలు, అంతర్జాతీయ నంబర్లు, సిగ్నల్, వాట్సాప్ వంటి ఎన్‌క్రిప్టెడ్ యాప్‌లను వాడారు. అయినప్పటికీ, కొరియర్ నెట్‌వర్క్, మధ్యవర్తుల ద్వారా జరిగిన నగదు కదలికలను ఐటీ అధికారులు గుర్తించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News