- రెండు బైకులపై వచ్చిన నలుగురు దుండగులు
- పట్టపగలే కాల్పులు…
- నలుగురికి గాయాలు…
కరీంనగర్ నడిబొడ్డున పట్టపగలే తుపాకుల కాల్పులతో తీవ్ర సంచలనం సృష్టించింది. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే పీఎంజే జ్యువెలరీ షాపు లక్ష్యంగా ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ సాహసోపేత దోపిడీ స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. రెండు బైకులపై వచ్చిన నలుగురు దుండగులు ఒక్కసారిగా షాపులోకి చొరబడి, అడ్డుకోబోయిన సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో నలుగురికి తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.కేవలం కొద్ది నిమిషాల్లోనే భారీ ఎత్తున బంగారు ఆభరణాలను దోచుకున్న ముఠా, నగలతో అక్కడి నుంచి చాకచక్యంగా పరారైంది.
సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో ఘటనా స్థలాన్ని జల్లెడ పడుతున్నారు. షాపులోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రద్దీగా ఉండే ప్రాంతంలో, అది కూడా పగటిపూట ఇలాంటి ఘోరం జరగడం చూస్తుంటే, దొంగలు పక్కా ప్లాన్‌తోనే ఈ దాడికి పాల్పడినట్లు అర్థమవుతోంది. ప్రస్తుతం కరీంనగర్ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించి నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నారు.

