Saturday, April 18, 2026
Homeరంగారెడ్డిWater Crisis | మేడ్చల్ పాలిటెక్నిక్ కళాశాలలో నీటి కొరత

Water Crisis | మేడ్చల్ పాలిటెక్నిక్ కళాశాలలో నీటి కొరత

  • కళాశాల పక్కనే ఉన్న కార్వి గుంతలలో విద్యార్థుల స్నానాలు
  • యుఎస్ఎఫ్ఐ మేడ్చల్ మండల కార్యదర్శి కిరణ్ కుమార్

మేడ్చల్ పాలిటెక్నిక్ కళాశాలలో నీటి కొరత కళాశాల పక్కనే ఉన్న కార్వి గుంతలలో విద్యార్థుల స్నానాలు చేయడం అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తం చేసిన యుఎస్ఎఫ్ఐ మేడ్చల్ మండల కార్యదర్శి కిరణ్ కుమార్,ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ మేడ్చల్ మండల కార్యదర్శి కిరణ్ కుమార్ మాట్లాడుతూ మేడ్చల్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు నీటి సమస్య వెంటాడుతుందని అన్నారు.

విద్యార్థులు స్నానం చేయడానికి కూడా కళాశాలలో ఎటువంటి నీళ్ల సౌకర్యం లేదని దానివల్ల కళాశాల పక్కనే ఉన్న కార్వీ గుంతలలో విద్యార్థులు స్నానాలు చేసే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు,క్వారీ గుంతలో పడి విద్యార్థులు చనిపోతున్న జిల్లా విద్యాశాఖ అధికారులు మాత్రం స్పందించకపోవడం మొద్దు నిద్రలో ఉన్నారు అని చెప్పకనే చెపొచ్చు అని అన్నారు.

- Advertisement -

ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి మేడ్చల్ పాలిటెక్నిక్ కళాశాలకు నీటి సౌకర్యాన్ని కల్పించాలని కిరణ్ డిమాండ్ చేశారు, లేని పక్షంలో విద్యార్థుల పక్షాన నిలబడి అందరిని ఐక్యం చేసి పోరాటం చేస్తామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News