Homeమహబూబ్‌నగర్‌Kalwakurthy | ఎమ్మార్పీఎస్ , ఎం ఎస్ పి , కమిటీల విన్యాసంలో జిల్లా సదస్సు

Kalwakurthy | ఎమ్మార్పీఎస్ , ఎం ఎస్ పి , కమిటీల విన్యాసంలో జిల్లా సదస్సు

పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని యుటిఎఫ్ భవనంలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ మరియు అనుబంధ సంఘాల నూతన నిర్మాణం కోసం జిల్లా స్థాయి సదస్సు ఘనంగా నిర్వహించారు. జిల్లా ఇంచార్జిలు ఆడెపు నాగార్జున మాదిగ, మద్దిలేటి మాదిగల అధ్యక్షతన జరిగినలో ఈ సదస్సులో జిల్లా, నియోజకవర్గ, మండల మరియు గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా సదస్సులో నాయకులు మాట్లాడుతూ, మాదిగ జాతి హక్కుల సాధనలో ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో, అనురక్తితో పనిచేయాల్సి ఉన్నదని ప్రశ్నించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయాలని, ప్రతి గ్రామంలో బలమైన కమిటీలను ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్పష్టమైన ఆదేశాలు వెల్లడించారు.

- Advertisement -
mrps district conference held kalwakurthy restructuring

ఈ సమావేశంలో సామాజిక న్యాయం, ఎస్సీ వర్గీకరణ పరిపూర్ణంగా అమలు చేయించేలా పర్యవేక్షణ, మాదిగల రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణను ప్రాధాన్యంగా తీసుకోవడం, యువతకు ఉద్యమంలో కీలక స్థానం కేటాయించడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. సంస్థ బలోపేతమే ఉద్యమ విజయం కోసం బలమైన పునాది అని. అంతేకాకుండా జిల్లా స్థాయిలో అన్ని మండలాల్లో త్వరితగతిన ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్ పి మరియు అనుబంధ సంఘాల కమిటీలను పూర్తి చేసుకుని, గ్రామ స్థాయి నుంచి ఉద్యమాన్ని మరింత విస్తరింపజేయాలని నిర్ణయించారు.

సదస్సు విజయవంతం కావడంలో జిల్లా, నియోజకవర్గ, మండల నాయకులు, మహిళా నేతలు, యువజన ప్రతినిధులు మరియు కార్యకర్తలు మద్ధతుగా నిలిచారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, సామాజిక సర్వీసు నిర్వాహకులు హాజరయ్యారు.
సదస్సు ఉత్సాహకర వాతావరణంలో సాగి, సంస్థ నూతన ప్రణాళికలు చేపట్టే తీర్మానం తీసుకొని నియోజకవర్గ కమిటీలు పూర్తిస్థాయిలో చేపట్టి ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, జిల్లా అధ్యక్షులు గుడిగానిపల్లి రాజు మాదిగ ఎం ఎస్ పి, పార్టీ జిల్లా అధ్యక్షులు కరిగేళ్ల దశరతంమాదిగ, ఎమ్మార్పీఎస్, జిల్లా ఉపాధ్యక్షులు అడెల్లి అంజి మాదిగ ఎమ్మార్పీఎస్, కల్వకుర్తి మండల ఇంచార్జి పర్శపాకుల శేఖర్ మాదిగ ఎమ్మార్పీఎస్, జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్దులు మాదిగ కళామండలి జిల్లా కార్యదర్శి బొల్లె జగన్, మాజీ కౌస్లర్ చిన్న, ఎం ఆర్ పి ఎస్, మండలం, జిల్లా, సీనియర్ నాయకులు నాయకులు, గూట విజయ్ మాదిగ, పరమేష్ మాదిగ రాముడు మాదిగ, పరమేష్ మాదిగ,కుర్మయ్య మాదిగ,చంటి మాదిగ, భగవంత్ మాదిగ, బాలన్న మాదిగ, రాధాకృష్ణ మాదిగ, నాగన్న మాదిగ తదితరులు పాల్గొన్నారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News