Tuesday, April 14, 2026
Homeఆదిలాబాద్Jayanti | వాడవాడలా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు..

Jayanti | వాడవాడలా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు..

  • కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా వేడుకలు..

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో బిఆర్ అంబేద్కర్ 135 జయంతి ఉత్సవాలు వాడవాడలా అంబరాన్నంటాయి. కులమతాలకు రాజకీయాలకు అతీతంగా కార్మిక, కర్షక, దళిత సంఘాలు జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు బెల్లంపల్లి కాంగ్రెస్,పార్టీ కార్యాలయం మునిసిపాలిటీ కార్యాలయాలు, కాంటా చౌరస్తాలో భారీ ఎత్తున వేడుకలు జరుపుకున్నారు. ఇక్కడ సందడి కనిపించింది. ఎమ్మెల్యే గడ్డం వినోద్ బెల్లంపల్లి మున్సీపాలిటీ, కాంగ్రెస్ కాంట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూల వేసి నివాళులు అర్పించారు.

కాంగ్రెస్కార్యాలయంలో కేక్ కట్ చేశారు వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ అణగారిన వర్గాలు, సమస్త ప్రజల హక్కులు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించడం వల్లనే సాధ్యమైందని అన్నారు. అంబేద్కర్ ఆశయాల వెలుగులోనే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని అన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే గడ్డం వినోద్ క్యాంపు కార్యాలయంలో డాక్టర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూల వేసి నివాళులు అర్పించారు.

- Advertisement -

ఈ కార్య క్రమంలో బెల్లంపల్లి మునిసిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి రమేశ్, వైస్ చైర్మన్ రాగంశెట్టి సత్యనారాయణ, మున్సిపల్ మాజీ చైర్మన్ సూరిబాబు, మునిసిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిలుముల శంకర్,నాతరి స్వామి,కటకం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లయ్య, మునిసిపల్ కౌన్సిలర్లు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News