Saturday, April 11, 2026
Homeస్పోర్ట్స్Vaibhav Sooryavanshi | చిచ్చరపిడుగు ఈ కుర్రాడు..

Vaibhav Sooryavanshi | చిచ్చరపిడుగు ఈ కుర్రాడు..

  • ఏపీఎల్ లో యువ సెన్షేషన్ వైభవ్ సూర్య వంశీ..

ఇదేమీ చిన్న‌పిల్ల‌ల ఆట‌కాదు. 15 ఏళ్లే క‌దా అనుకుంటే పొరపాటే. ఐపీఎల్‌లో యువ సెన్షేష‌న్ .. వైభ‌వ్ సూర్య‌వంశీ(Vaibhav Sooryavanshi) ఇర‌గ‌దీస్తున్నాడు. భారీ షాట్ల‌తో అల‌వోక‌గా మేటి బౌల‌ర్ల‌ను ఆడేస్తున్నాడు. పిల్ల‌వాడిని కాదు.. పిడుగునే అన్న‌ట్లు విరుచుకుప‌డుతున్నాడు. టీ20 క్రికెట్ లీగ్‌లో ఓ కొత్త త‌ర‌హా ఆట‌శైలికి తెర‌లేపుతున్నాడు. ఐపీఎల్‌లో భాగంగా బెంగుళూరుతో శుక్ర‌వారం జ‌రిగిన మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ బ్యాట‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ త‌న ప‌వ‌ర్ స్ట్రోక్స్‌తో దుమ్మురేపాడు. బంతి ఎటు వేసినా.. దాన్ని బౌండ‌రీ దాటించేశాడు. మేటి బౌల‌ర్ల‌ను కూడా ఈజీగా ఆడేశాడు.

ముంబైతో జ‌రిగిన మ్యాచ్‌లో బుమ్రా వేసిన తొలి బంతినే సిక్స‌ర్ కొట్టాడు వైభ‌వ్‌. ఇక ఆర్సీబీతో జ‌రిగిన మ్యాచ్‌లోనూ భువ‌నేశ్వ‌ర్‌, హేజిల్‌వుడ్‌ను చాలా టెక్నిక్‌తో ఎదుర్కొన్నాడు. ఆరంభంలోనే భువ‌నేశ్వ‌ర్ వేసిన యార్కర్‌ను చాలా స‌మ‌యోచితంగా ఎదుర్కొన్నాడు. కేవ‌లం హిట్టింగ్ మాత్ర‌మే కాదు.. టెక్నిక‌ల్ గేమ్ కూడా త‌న వ‌ద్ద ఉంద‌న్న రీతిలో బ్యాటింగ్ ప్ర‌జెంట్ చేశాడు. ఇక ఆస్ట్రేలియా మేటి బౌల‌ర్ హేజిల్‌వుడ్‌ను కూడా ఎదుర్కొన్న తీరు హ‌ర్ష‌ణీయ‌మే. వాస్త‌వానికి గాయంతో గ్యాప్ తీసుకున్న హేజిల్‌వుడ్‌.. ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ ఆడాడు. జైస్వాల్‌ను అత‌ను చాలా తెలివిగా ఔట్ చేశాడు. ఇక అదే త‌ర‌హా బంతిని వైభ‌వ్‌కు వేశాడు. కానీ సూర్య‌వంశీ మాత్రం త‌న ట్యాలెంట్ ఏంటో చూపించాడు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News