టాపర్స్ అర్జున హైట్స్ భవనం అలియాస్ అర్బన్ క్యాంపస్..
- ఇంటర్ బోర్డు పరీక్షలు తప్పుతున్న విద్యార్థులు..
- జూనియర్ కాలేజీ నిర్వహణకు ఇంటర్ బోర్డు అనుమతులు లేవు
- సంవత్సరానికి ఏకంగారూ. 5 లక్షల ఫీజులు..
- తల్లి తండ్రులారా మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే..
చారాణా కోడికి బారాణా మసాలా అన్నట్లు.. చదువు లేదు చట్టబండలు లేదు.. పేరు గొప్ప వూరు దిబ్బ అన్న చందంగా నారాయణ విద్యాసంస్థల వ్యవహారం నడుస్తోంది.. వారికి డబ్బు యావ తప్ప పిల్లల భవిష్యత్తు అవసరం లేదు.. లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని పీలుస్తున్నారు.. విద్యార్థుల భవిష్యత్తును అంధకార బంధురం చేస్తున్నారు..
నారాయణ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు ఐ ఐ టి, నీట్ లాంటి ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంక్ సాధించినప్పటికీ, ఇక్కడ చదువుతూ ఇంటర్మీడియెట్ పాస్ కాకపోవడం చూస్తుంటే నారాయణ కాలేజీల్లో బోధన ఎంత నాశిరకంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.. తల్లి దండ్రులారా ఇప్పటికైనా ఆలోచించండి.. మీరు అప్పులు పాలు కాకండి తప్పులు చేస్తూ మీ పిల్లల బంగారు భవిష్యత్తును నాశనం చేయకండి..
మాదాపూర్, అయ్యప్ప సొసైటీలో ఇంటర్ బోర్డు అనుమతులు లేకుండా నడుస్తున్న అర్జున హైట్స్ టాపర్స్ క్యాంపస్ అలియాస్ అర్బన్ క్యాంపస్ గా చలామణీ చేస్తోంది నారాయణ విద్యాసంస్థ.. ఈ సంస్థలపై తక్షణమీ చర్యలు తీసుకోవాలనే డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి.. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకు, రంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులకు ఒక విజ్ఞప్తి.. మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీ పరిధిలో జై హిందఎన్ క్లేవ్, స్విమ్మింగ్ పూల్ రోడ్ లో “నెంబర్ వన్, నెంబర్ వన” అంటూ పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తూ..
ప్రజలను మోసం చేస్తున్న నారాయణ విద్యాసంస్థలు (జూనియర్ కాలేజీ) వాస్తవానికి ఎలాంటి సరైన విద్యా ప్రమాణాలు, ప్రభుత్వ అనుమతులు లేకుండా సంవత్సరాలుగా నిర్విఘ్నంగా నడుస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టి, తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ విద్యార్థిని, విద్యార్థులకు ఐఐటి, నీట్ లలో మంచి ర్యాంక్ వచ్చినప్పటికి ఇంటర్ బోర్డ్ పరీక్షలు తప్పుతున్న పరిస్థితులు దాపురించాయి.. కానీ ఫజులు మాత్రం సంత్సరానికి సుమారు రూ. 5 లక్షలు వసూలు చేస్తూ కొనసాగుతున్న ఈ అక్రమ వ్యవహారంపై ఇప్పటివరకు అధికారులు కనీస స్పందన చూపకపోవడం తీవ్రంగా ఖండించదగిన విషయం.

ఈ విద్యాసంస్థలకు సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు నుండి ఎలాంటి అనుమతులు, అనుబంధాలు, భవన భద్రతా సర్టిఫికేట్లు, అగ్ని ప్రమాద భద్రతా ప్రమాణాలు, అర్హత గల ఉపాధ్యాయులు వంటి మౌలిక అంశాలపై ఎలాంటి స్పష్టత లేకుండా, విద్యార్థుల భవిష్యత్తును చీకట్లో నెట్టేస్తున్నారు. అయినప్పటికీ, ఈ అక్రమ వ్యవస్థను కాపాడుతున్నట్లుగా అధికారులు మౌనం వహించడం అనుమానాలకు తావిస్తోంది.
ఇది కేవలం ఒక విద్యాసంస్థ సమస్య కాదు.. ఇది మొత్తం విద్యా వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే తీవ్రమైన అంశం. “నెంబర్ వన” అంటూ మోసపూరిత ప్రకటనలు ఇచ్చి, వాస్తవానికి ఎలాంటి ఉన్నత ప్రమాణాలు లేకుండా నడుస్తున్న సంస్థలను ఎందుకు ఇప్పటివరకు గుర్తించలేకపోయారు? వారి ఖచ్చితమైన చిరునామాలు కూడా తెలియకపోవడం అధికారుల వైఫల్యానికి నిదర్శనం కాదా? వెంటనే మాదాపూర్ అయ్యప్ప సొసైటీ పరిధిలో నడుస్తున్న నారాయణ విద్యాసంస్థలపై తనిఖీలు నిర్వహించాలి.. తక్షణమే నారాయణ విద్యాసంస్థలను సీజ్ చేసి మూసివేయాలి.. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.. తల్లిదండ్రులకు, విద్యార్థులకు పూర్తి సమాచారం బహిర్గతం చేయాలి.. భవిష్యత్తులో ఇలాంటి అక్రమ సంస్థలు నిర్వహించకుండా కఠిన చర్యలు తీసుకోవాలి..
ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు అవినీతి నిద్రలోనుంచి మేల్కొని, స్వలాభం చూసుకోకుండా, కేవలం జేబులు నిండితే చాలు అనుకోకుండా, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచించి, మనుషులుగా ఆలోచించి, మానవత్వం చూపించి స్పందించకపోతే, విద్యార్థి సంఘాలు, ప్రజా సంస్థలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడం తప్పదు. ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తే దాని పూర్తి బాధ్యత సంబంధిత అధికారులదే అవుతుంది. “విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే అక్రమ విద్యాసంస్థలను సహించము!”..
“ప్రకటనలతో కాదు — ప్రమాణాలతోనే నెంబర్ వన్ అని నిరూపించాలని విద్యార్థి సంఘాల వారు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు..టాప్ ర్యాంకుల మభ్యతో తల్లిదండ్రుల ఆశనే నారాయణ క్యాష్ చేసుకుంటోంది.. టాపర్స్ అనేది కేవలం ముసుగు.. లోపల డబ్బు దోపిడీ యంత్రం ఈ నారాయణ.. నెంబర్ వన్ అంటూ నాటకం.. తల్లిదండ్రులపై దోపిడీ యంత్రం నారాయణ విద్యాసంస్థలు..
