Homeఆదాబ్ ప్రత్యేకంShankarpally | జీఓ 111 పేరుతో పైసా వసూల్...

Shankarpally | జీఓ 111 పేరుతో పైసా వసూల్…

  • జీఓ 111 ఉల్లంఘనలపై చర్యలేవీ? నిబంధనల అమలు శూన్యం..
  • శంకర్‌పల్లి మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలపై చర్యలు ఎక్కడ ?
  • భారీ షెడ్లు, ఫామ్‌హౌస్‌లు, కన్వెన్షన్ హాళ్ల అనుమతులపై ఆరోపణలు..
  • మామూళ్ల మత్తులో మునిగిన అధికార యంత్రాంగం..?
  • ఇంటి నంబర్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు..
  • ఆక్రమ నిర్మాణాలపై జిల్లా అధికారులు స్పందించాలని డిమాండ్..

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మున్సిపాలిటీలో(Shankarpally Municipality) నిర్మాణాల అనుమతులు, జీఓ111 నిబంధనల అమలు, ఇంటి నంబర్ల కేటాయింపు, పార్కు స్థలాల పరిరక్షణ అంశాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. పలు ప్రాంతాల్లో నిర్మాణాలపై ఫిర్యాదులు, అక్రమాల ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో తీసుకుంటున్న చర్యలపై స్పష్టత కొరవడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నోటీసులు జారీ చేయడానికే అధికారులు పరిమితమవుతున్నారా?ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై తదుపరి చర్యలు ఎందుకు కనిపించడం లేదనే ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి.

నిబంధనల అమలుపై విచారణకు డిమాండ్.. మున్సిపాలిటీ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో భారీ షెడ్లు,ఫామ్‌హౌస్‌లు,కన్వెన్షన్ హాళ్లు,ఇతర భవనాల నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన అనుమతులు,భూ వినియోగ నిబంధనలు, నిర్మాణ అనుమతుల చెల్లుబాటుపై సమగ్ర పరిశీలన జరపాలనే డిమాండ్ వినిపిస్తోంది. ముఖ్యంగా జీఓ111పరిధికి సంబంధించిన నిబంధనలు వర్తించే ప్రాంతాల్లో నిర్మాణాల చట్టబద్ధతను సంబంధిత అధికారులు నిర్ధారించాల్సిన అవసరం ఉంది. నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

- Advertisement -

మున్సిపల్ అధికారుల తీరుపై ప్రశ్నలు.. జీఓ 111 అమలు పేరుతో పైసా వసూళ్లు జరుగుతున్నాయి.. శంకర్‌పల్లి మున్సిపాలిటీలో(Shankarpally Municipality) నిర్మాణ అనుమతులు, ఇంటి నంబర్ల కేటాయింపుపై వస్తున్న ఆరోపణలు అధికారుల తీరుపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినట్లు ఫిర్యాదులు అందిన సందర్భాల్లో అధికారులు నోటీసులు జారీ చేసినా, ఆ తర్వాత తీసుకున్న చర్యలపై వివరాలు వెల్లడించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. నోటీసుల జారీ, వివరణల స్వీకరణ, క్షేత్రస్థాయి తనిఖీలు, తదుపరి చట్టపరమైన చర్యల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.

Shankarpalli GO 111 Violations2.jpg1

ఉల్లంఘనలు నిర్ధారణ అయినప్పటికీ చర్యలు తీసుకోవడంలో జాప్యం జరిగితే బాధ్యత ఎవరిదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇంటి నంబర్ల కేటాయింపులో అక్రమాల ఆరోపణలు..! కొన్ని భవనాలకు ఇంటి నంబర్ల కేటాయింపు ప్రక్రియలో నిబంధనలు పాటించలేదనే ఆరోపణలు కూడా చర్చకు వస్తున్నాయి. సంబంధిత భవనాలకు అనుమతులు ఉన్నాయా? ఇంటి నంబర్లు కేటాయించే ముందు అవసరమైన ధ్రువపత్రాలను పరిశీలించారా? క్షేత్రస్థాయి పరిస్థితులను అధికారులు ధ్రువీకరించారా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.

అధికారులకు ముడుపులు చెల్లించి పనులు చేయించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో, వాటి నిజానిజాలను తేల్చేందుకు సంబంధిత రికార్డులను పరిశీలించి నిష్పక్షపాత విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది.

జీఓ111నుంచి పార్కు స్థలాల వరకు.. శంకర్‌పల్లిలో సమగ్ర విచారణకు డిమాండ్.. వెంచర్ లలో పార్కుల కోసం కేటాయిం చిన స్థలాలు, ప్రజావసరాల కోసం ఉద్దేశించిన భూముల పరిరక్షణపైనా ప్రశ్నలు వ్యక్తమవు తున్నాయి. కేటాయించిన స్థలాలు యథా తథంగా ఉన్నాయా? వాటిలో ఆక్రమ ణలు జరిగాయా?పార్కింగ్ కోసం నిర్దే శించిన ప్రదేశాలను ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారా? అనే అంశాలపై అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రజావసరాల స్థలాలు ఆక్రమణలకు గురైనట్లు తేలితే వాటిని చట్టప్రకారం పరిరక్షించాలని కోరుతున్నారు.

Shankarpalli GO 111 Violations2.jpg12

ఆక్రమ నిర్మాణాలపై జిల్లా అధికారులు స్పందించాలి..! శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో భవన నిర్మాణ అనుమతులు, జీఓ 111నిబంధనల(GO 111 Regulations_) అమలు, ఇంటి నంబర్ల కేటాయింపు, పార్కు స్థలాల పరిరక్షణపై జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. అందిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలు, పెండింగ్‌లో ఉన్న నోటీసులు, అనుమతుల రికార్డులు, కేటాయింపులకు సంబంధించిన పత్రాలను పరిశీలించి వాస్తవాలను వెల్లడించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలతో నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆరోపణలు నిజమా? నిర్లక్ష్యం ఉందా? అన్నది అధికారుల విచారణలో తేలాల్సి ఉంది. పారదర్శకంగా వ్యవహరించి, నిబంధనలను అందరికీ సమానంగా అమలు చేసినప్పుడే ప్రజల్లో మున్సిపల్ యంత్రాంగంపై విశ్వాసం పెరుగుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News