నిర్మల్ జిల్లా కేంద్రంలో సోమవారం బీజేపీ 47వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా, బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, విప్లవాత్మక సంస్కరణలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు. దేశంలో అనేక విప్లవాత్మక, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా నిలిపిన ఘనత బీజేపీదని ఆయన పేర్కొన్నారు. పార్టీ స్థాపించినపుడు రెండు స్థానాలతో మొదలై నేడు వరుసగా మూడు సార్లు కేంద్రంలో అధికారంలోకి రావడంలో కార్యకర్తల కృషి ఎంతో ఉందని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించారు.
- Advertisement -
