Monday, March 30, 2026
Homeకెరీర్ న్యూస్COE Admissions | సీఓయీ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు..

COE Admissions | సీఓయీ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు..

  • వివరాలు తెలిపిన సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి..
  • ఏప్రిల్ 7లోగా ఆన్ లైన్ లో దరఖాస్తులు సమ్పార్పించాలి.

తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ ఆధ్వర్యంలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌(సీవోఈ) జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి ప్రకటన విడుదల చేశారు. అయా కాలేజీల్లో 2026-27 విద్యాసంవత్సరానికి ఇంటర్‌ ఫస్టియర్‌ ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని తెలిపారు. పదో తరగతి పాసైన వారు, ప్రస్తుతం పదో తరగతి పరీక్షకు హాజరవుతున్న గిరిజన విద్యార్థులు ప్రవేశాలకు అర్హులని వెల్లడించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఏప్రిల్‌ 7లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News