Thursday, March 26, 2026
Homeక్రైమ్ వార్తలుHyderabad | నకిలీ కొబ్బరిపొడి తయారీ..

Hyderabad | నకిలీ కొబ్బరిపొడి తయారీ..

  • నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు..
  • 8, 300 కిలోల కొబ్బరి పొడి, ప్యాకింగ్ యంత్రాల స్వాధీనం..

కొందరు అక్రమార్కులు కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా హైదరాబాద్ బేగంబజార్ లోని ఓ కేంద్రంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి, కల్తీ కొబ్బరిపొడి గుట్టురట్టు చేశారు. టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. బేగంబజార్లో ‘బాలాజీ పురుషోత్తం కోకోనట్ బిజినెస్ షాప్’ పేరుతో కొబ్బరి పొడిని తయారు చేస్తున్న కేంద్రంపై గోల్కొండ, ఖైరతాబాద్ జోన్ల టాస్క్ ఫోర్స్ బృందాలు, గోషామహల్ పీఎస్ అధికారులు కలిసి దాడి చేశారు. యజమాని నకుల్ మరోటియా(31)ను అరెస్టు చేశారు.

ఇతను కర్ణాటక నుంచి నాణ్యత లేని కొబ్బరిపొడిని తక్కువ ధరకు కొనుగోలు చేసి దానికి రసాయనాలు కలిపి, నాణ్యమైన కొబ్బరి పొడిలాగ తయారుచేసి ‘చేతక్ బ్రాండ్ అనే పేరు ఉన్న ప్యాకెట్లలో నింపుతున్నాడు. ప్యాకెట్లపై బ్యాచ్ నంబరు, ఎక్స్పైరీ డేట్, ఆహార భద్రతా ప్రమాణాల లైసెన్సు వివరాలేవీ లేవని అధికారులు తెలిపారు. నిందితుడు బేగంబజార్ కేంద్రంగా సస్ఏజెంట్లను నియమించుకొని రాష్ట్రవ్యాప్తంగా కల్తీ కొబ్బరి పొడి ప్యాకెట్లను విక్రయిస్తున్నాడన్నారు. ఘటనాస్థలం నుంచి రూ.21 లక్షల విలువ చేసే 8,300 కిలోల కొబ్బరి పొడి, ప్యాకింగ్ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News