Friday, March 20, 2026
Homeవరంగల్‌RSP | మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి.

RSP | మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి.

  • ఆర్.ఎస్.పి. డిమాండ్.

వరంగల్ జిల్లా పర్వతగిరి మండల పరిధిలోని మొక్కజొన్న రైతులను ఆదుకునేందుకు మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలని రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు వరంగల్ జిల్లా కార్యదర్శి వల్లందాస్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. క్వింటాకు రూ.2400 మద్దతు ధరతో మొక్కజొన్నను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై ఉందని ఆయన గుర్తు చేశారు.

రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న పంట చేతికొచ్చినప్పటికీ కొనుగోలు కేంద్రాలు సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించకపోవడంతో వ్యాపారులు దళారులు పౌల్ట్రీ నిర్వాహకులు దీనిని అవకాశంగా తీసుకుంటున్నారని ఆరోపించారు. గ్రామాలలో రైతుల వద్ద నుంచి క్వింటాకు రూ. 1600 నుండి రూ.1900 వరకు తక్కువ ధరకు మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు.

- Advertisement -

దీంతో రైతులు త్రీవ ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటూ దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రైతుల ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని మార్క్ పేడ్ ద్వారా వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, మద్దతు ధరతో కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News