కోట్లాది రూపాయల ప్రజాధనం కాళేశ్వరం కమీషన్ల ప్రవాహంలో కొట్టుకుపోతుంటే.. నమ్ముకున్న నేలతల్లి గుండె బీటలు వారి.. అన్నదాత కళ్ళల్లో కన్నీరు సెలయేరవుతోంది. నాయకులు రాజకీయాన్ని నమ్ముకుని నివేదికలను దాచేస్తుండవచ్చు… కానీ గుర్తుంచుకోండి, రాజ్యానికి అన్నదాత ఏడుపే చేటు! పాలకుల వైఫల్యాలపై విసిగిపోయిన రైతు, రేపు ‘క్రాప్ హాలిడే’ అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే… సమాజానికి గుక్కెడు మెతుకు దొరకడమే కరవు అవుతుంది. ఇప్పటికైనా కల్లబొల్లి కబుర్లు ఆపి, కళ్ళముందున్న కఠిన నిజాలను ఒప్పుకుని, రైతన్నను ఆదుకోకపోతే ఈ మట్టి మనల్ని ఎన్నటికీ క్షమించదు!
- బీవీఆర్ రావు..
- Advertisement -
